సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆకట్టుకుంటున్న ‘గరివిడి లక్ష్మి’ లోని కొండ కోన కోరసు పాడే పాట

ABN, Publish Date - Sep 26 , 2026 | 04:24 PM

'గరివిడి లక్ష్మీ' సినిమా అక్టోబర్ 17న రాబోతోంది. ఈ సందర్భంగా ఇందులోని 'కొండ కోన కోరసు పాడే' అనే పాటను మేకర్స్ రిలీజ్‌ చేశారు.

భారీ స్థాయి సినిమాలతో అలరించే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి కథని ప్రేక్షకులు ముందుకు తీసుకు రాబోతోంది. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది మెరుస్తోంది. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. బుర్రకథలు చెప్పడమే కాదు, ఓ ఉద్యమంగా మార్చిన లక్ష్మి జీవితాన్ని ఈ సినిమా ఆవిష్కరించనుంది. టీజీ విశ్వ ప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ‘గరివిడి లక్ష్మి’ ఓ పాటతో వేలాది హృదయాల్లో నిలిచిపోయిన జానపద గాయని జీవితాన్ని రిక్రియేట్ చేస్తోంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కొండ కోన కోరసు పాడే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటని చరణ్ అర్జున్ స్వయంగా సాహిత్యం అందించి ఆకట్టుకునేలా కంపోజ్ చేశారు. అనన్య భట్, చరణ్ అర్జున్ పాడిన తీరు అందరినీ అలరించింది. ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. విశేషం ఏమంటే ఇందులో కీలక పాత్ర పోషించిన రాగ్‌ మయూర్‌ నటించిన 'అనుమాన పక్షి' మూవీ శుక్రవారం విడుదలైంది. 'గరివిడి లక్ష్మీ' వచ్చే నెల 17న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో నరేష్, రాశి, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఇక నో డౌట్.. ‘రణబాలి’ వచ్చేది ఫిక్స్.. న్యూ పోస్టర్ వైరల్

సల్మాన్ ఖాన్ ‘మాన్‌స్టర్’.. మైండ్‌ బ్లోయింగ్‌ డీల్‌!

గతేడాది ఇదే టైమ్‌కి థియేటర్లలో ఫైర్ స్ట్రోమ్: సుజీత్ పోస్ట్ వైరల్

Updated Date - Sep 26 , 2026 | 05:36 PM