ఇక నో డౌట్.. ‘రణబాలి’ వచ్చేది ఫిక్స్.. న్యూ పోస్టర్ వైరల్
ABN , Publish Date - Sep 25 , 2026 | 09:31 PM
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రశ్మిక మందన్న జంటగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ భారీ పాన్-ఇండియా చిత్రం ‘రణబాలి’ రిలీజ్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రశ్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ భారీ పాన్-ఇండియా చిత్రం ‘రణబాలి’ (Ranabaali). ‘టాక్సీవాలా’ వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ - దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామాను టీ-సిరీస్ సమర్పణలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ చిత్రం విడుదల వాయిదా పడుతోందంటూ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే వాటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ చిత్ర బృందం విడుదల తేదీని అధికారికంగా తెలియజేస్తూ ఓ సరికొత్త పవర్‌ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
ముందుగా ప్రకటించినట్లుగానే ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. విడుదలైన తాజా పోస్టర్‌లో విజయ్ దేవరకొండ ఆహార్యం రోమాంచితంగా ఉంది. తన మాతృభూమి కోసం, తన ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయక పోరాడే యోధుడు ‘రణబాలి’గా నుదుట వీరతిలకం దిద్దుకుని, ఆవేశంతో కూడిన విజయ్ లుక్ అభిమానులను భారీగా ఆకట్టుకుంటోంది.
19వ శతాబ్దపు బ్రిటీష్ పాలన నాటి పరిస్థితుల నేపథ్యంలో.. 1854 నుంచి 1878 మధ్య జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ కథను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఏందయ్య సామీ..’ లిరికల్ సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచి, విజయ్-రశ్మికల క్రేజీ కెమిస్ట్రీతో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అతి త్వరలోనే మిగిలిన పాటలతో పాటు సినిమా ట్రైలర్‌ను అత్యంత గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విడుదలపై ఉన్న సందిగ్ధత తొలగిపోయి అక్టోబర్ 16 రిలీజ్ లాక్ అవ్వడంతో రౌడీ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
సల్మాన్ ఖాన్ ‘మాన్‌స్టర్’.. మైండ్ బ్లోయింగ్ డీల్!
గతేడాది ఇదే టైమ్‌కి థియేటర్లలో ఫైర్ స్ట్రోమ్: సుజీత్ పోస్ట్ వైరల్
నయనతార ‘హాయ్’ ఓటీటీకి వచ్చేసింది.. మరి ‘టాక్సిక్’ స్ట్రీమింగ్ ఎప్పుడు?