ENE 2 Trailer: సినిమా హిట్ కాకపోతే ఉరి తీయండి..
ABN, Publish Date - Nov 03 , 2026 | 05:07 PM
‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు కొనసాగింపుగా ఇప్పుడు ‘ENE Repeat’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సరదాగా సాగిపోయిన ఈ ట్రైలర్ ను మీరు చూసేయండి..
2018లో విడుదలైన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు కొనసాగింపుగా ఇప్పుడు ‘ENE Repeat’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విశ్వక్ సేన్, సాయినాథ్ మాగంటి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అనిషా అంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్, ప్రియదర్శిని రామ్, కరుణాకుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. నవంబరు 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మొదటి భాగంలో గోవా నేపథ్యంలో నలుగురు స్నేహితుల మధ్య జరిగిన సరదా సంఘటనలను చూపించిన తరుణ్ భాస్కర్.. ఈసారి కథను బ్యాంకాక్‌కు తీసుకెళ్లినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సరదాగా సాగిపోయిన ఈ ట్రైలర్ ను మీరు చూసేయండి..
ALSO READ:
Ritika Singh: నా పేరుతో.. నాకు తెలియకుండానే సబ్ స్క్రిప్షన్ రూ.400 వసూలు చేస్తున్నారు
Mahesh Babu: గేమింగ్ రంగంలోకి మహేశ్ బాబు.. షార్ట్ గన్ గేమ్స్‌లో పెట్టుబడి!
Sundar C: నిజాలు తెలుసుకోకుండా.. వార్తలు రాయడం బాధిస్తుంది