‘అనకాపల్లి’ ట్రైలర్ రివ్యూ: రా అండ్ రస్టిక్ ఊరమాస్ యాక్షన్ జాతర
ABN, Publish Date - Jul 27 , 2026 | 06:49 PM
విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అనకాపల్లి’. ఈ మూవీ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
విక్రమ్ సహిదేవ్ (Vikram Sahidev), సంధ్యా వశిష్ట (Sandhya Vasishta), తారక్ పొన్నప్ప (Tarak Ponnappa) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అనకాపల్లి’. దర్శకుడు ఖగేష్ తమ్మినేని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించడమే కాకుండా.. ఓ కీలక పాత్రలో త్రినాథరావు నక్కిన నటించారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ (Anakapalli Trailer) ప్రేక్షకులలో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..
ట్రైలర్ ఆరంభం నుంచే దర్శకుడు కథలోని తీవ్రతను, గ్రామీణ నేపథ్యాన్ని చక్కగా పరిచయం చేశారు. త్రినాథరావుకు ఒక పిట్టకథను తారక్ పొన్నప్ప చెబుతున్నట్లుగా ట్రైలర్‌ని ప్రారంభించారు. కథ చెబుతా, కథ చెబుతా అంటూ ఓ పాట రూపంలో ‘అనకాపల్లి’ స్టోరీని చెబుతున్న తీరు ఎంతో ఆసక్తికరంగా ఉంది. హీరోగా విక్రమ్ సహిదేవ్ లుక్, బాడీ లాంగ్వేజ్, మేకోవర్ చాలా రగ్గడ్‌గా, పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ప్రేమికుడిగా, ఊరమాస్ అవతార్‌లో శత్రువులపై విరుచుకుపడే యువకుడిగా ఆయన చూపించిన ఎనర్జీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందనే విషయం ఈ ట్రైలర్ తెలియజేస్తోంది.
ఒకవైపు చిలిపి ప్రేమకథ, పల్లెటూరి వాతావరణం కనిపిస్తూనే, మరోవైపు కౌరవ నీతి, చీకటి-వెలుగుల పోరాటం అంటూ సాగే వైలెంట్ డ్రామా ట్రైలర్ గ్రాఫ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్ళింది. దేవ్‌జాంద్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌లోని యాక్షన్ సన్నివేశాలకు, ఎమోషన్స్‌కు ప్రాణం పోసింది. అలాగే విజువల్స్, కలర్ గ్రేడింగ్ సినిమా రా అండ్ రస్టిక్ టోన్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. త్రినాథరావు నక్కిన, ఇంద్రజ జంట నేచురల్‌గా కనిపిస్తోంది. ఇక హీరో, హీరోయిన్లు చాలా ఫ్రెష్‌గా కనిపిస్తున్నారు. ఓ మంచి లవ్ స్టోరీతో పాటు.. మాస్, రా అండ్ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుందనే విషయం ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఆగస్ట్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. ట్రైలర్ మాత్రం సినిమాపై భారీగా అంచనాలను పెంచేలా కట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
యాక్టింగ్‌లోకి దిగిన దర్శకుడు.. ‘అనకాపల్లి’ ట్రైలర్ ఎలా ఉందంటే
అనిల్ రావిపూడి కోసం నిర్మాతలు క్యూ.. ‘పెద్ది’ సారూ?
మరీ ఈ రేంజ్‌లోనా.. ఆదర్శకుటుంబం వెంకీ పాత్ర రివీల్