Aakasamlo Oka Tara: పదిమంది నవ్వితే ఏమైంది.. ఒక్కరు నమ్మితే చాలదా!
ABN, Publish Date - Nov 16 , 2026 | 04:07 PM
దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని తెరకెక్కిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ (Aakasamlo Oka Tara) సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.
దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) మరో చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ సాదినేని దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ (Aakasamlo Oka Tara). సాత్విక వీరవల్లి ఈ సినిమాతో కథానాయికగా పరిచయం అవుతున్నారు. శ్రుతి హాసన్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను చిత్రబృందం విడుదల చేసింది.
ఓ పల్లెటూరి అమ్మాయికి వ్యోమగామి కావాలనే అసాధారణమైన కల ఉంటుంది. ఆ కలను సాకారం చేసుకునే ప్రయాణంలో ఆమెకు ఎదురయ్యే పరిస్థితులు, సవాళ్లు, భావోద్వేగాల చుట్టూ కథ సాగనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఆ అమ్మాయి ఆశయానికి అండగా నిలుస్తూ, ఆమె కల నిజం చేసేందుకు ప్రయత్నించే వ్యక్తిగా దుల్కర్ సల్మాన్ కనిపిస్తున్నారు. కలలు కనడమే కాదు.. వాటిని నిజం చేసుకునేందుకు ఎంతటి పోరాటమైనా చేయాలనే సందేశంతో ఈ చిత్రం రూపొందినట్లు తెలుస్తోంది. నవంబరు 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ALSO READ:
తనిష్క్ దోపిడీ.. అరెస్టు తర్వాత పెరిగిన యూట్యూబర్ మీనాక్షి ఫాలోవర్స్
Ashika Ranganath: అల్లు అర్జున్ తో పని చేయడం చాలా బావుంది
కాకా.. వెంకటేష్ హీరోయిన్ తో చిరు స్టెప్పులు