ది రెడ్ బ్యాగ్ నుంచి మరో పాట వచ్చేసింది!

ABN, Publish Date - Aug 15 , 2026 | 06:51 PM

ది రెడ్ బ్యాగ్ సినిమా విడుదల వారం పాటు వాయిదా పడింది. ఇప్పుడీ సినిమా ఆగస్ట్ 21న విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాట విడుదలైంది.

హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ మూవీకి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. రాధ్య, రాశి, కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా నిజానికి ఆగస్ట్ 14న విడుదల కావాల్సింది. అయితే ఇప్పుడీ సినిమాను వారం ఆలస్యంగా ఆగస్ట్ 21న విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'ఎంజాయ్ ఎంజాయ్' పాటను రిలీజ్ చేశారు. కార్తీక్ కొడకండ్ల స్వరాలు సమకూర్చిన బాణీకి తగ్గ సాహిత్యాన్ని గణేశ్‌ ఆడెపు రాయగా, బీవీకే వాగ్దేవి దీనిని అంతే జోష్‌ తో పాడారు.

ఇవి కూడా చదవండి:

Fauzi: ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ‘ఫౌజీ’ పోస్టర్ అరాచకం

40 ఏళ్ళ విక్టరీ వెంకటేశ్ సినీ ప్రస్థానం.. ఈ విషయాలు తెలుసా

Sunday TV Movies: ఆదివారం.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే

Updated at - Aug 15 , 2026 | 06:53 PM