Tabu: గౌరీ హెగ్డే.. డిప్యూటీ కమిషనర్.. అదరగొట్టిన టబు
ABN, Publish Date - Aug 10 , 2026 | 12:09 PM
'గౌరీ హెగ్డే.. డిప్యూటీ కమిషనర్.. ఇన్‌కమ్ ట్యాక్స్” అంటూ టబు డైలాగ్‌తో అదరగొట్టారు టబు.
'గౌరీ హెగ్డే.. డిప్యూటీ కమిషనర్.. ఇన్‌కమ్ ట్యాక్స్” అంటూ టబు డైలాగ్‌తో అదరగొట్టారు టబు. విజయ్ సేతుపతి, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తొలిసారి కలిసి చేస్తున్న చిత్రం ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ చిత్రంలో టబు గౌరీ హెగ్డే పాత్రలో కనిపించనున్నారు. తాజాగా టబుకు సంబంధించిన పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆమె పోషిస్తున్న గౌరీ హెగ్డే పాత్ర ఎలా ఉండబోతుందో చూపించారు. ఈ గ్లింప్స్ చూస్తే టబు పాత్ర సినిమాకు ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నట్లు స్పష్టమవుతోంది. 'గౌరీ హెగ్డే.. డిప్యూటీ కమిషనర్.. ఇన్‌కమ్ ట్యాక్స్.. మా ఓల్డ్ సిటీలో ఫస్ట్ కాలుస్తాం.. తర్వాత మాట్లాడతాం” అంటూ టబు చెప్పే డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.