సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Samyuktha: 'స్వయంభూ'లో వీరనారిగా సంయుక్త.. కత్తి పట్టి యుద్ధం చేస్తూ అదుర్స్!

ABN, Publish Date - Sep 11 , 2026 | 02:08 PM

సంయుక్త  మీనన్ పుట్టినరోజు సందర్భంగా  ‘స్వయంభూ’ (Swayambhu) చిత్రం నుంచి  మేకర్స్ సంయుక్తకు సంబంధించిన ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. 

నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil siddarth) హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’ (Swayambhu). సంయుక్త, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా సంయుక్త  మీనన్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆమెకు సంబంధించిన ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో సంయుక్త చేతిలో కత్తి పట్టుకుని యుద్ధం చేసే వీరనారి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఇప్పటివరకు కనిపించని డిఫరెంట్ లుక్‌లో ఆమె కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

ఈ పాత్ర కోసం సంయుక్త గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారు. పాత్రకు తగ్గట్లుగా ఆమె తీసుకున్న శిక్షణ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.భారీ స్థాయిలో రూపొందుతున్న ‘స్వయంభూ’లో నిఖిల్ యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన రాగా, తాజాగా సంయుక్త లుక్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతుండగా, త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించనుంది.

Updated Date - Sep 11 , 2026 | 02:44 PM