సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

స్వయంభు టీజ‌ర్‌.. నిఖిల్ అద‌ర‌గొట్టాడుగా

ABN, Publish Date - Feb 11 , 2026 | 12:13 PM

నిఖిల్‌ హీరోగా సంయుక్త‌, న‌భా న‌టేశ్ హీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం స్వయంభు టీజ‌ర్‌ బుధ‌వారం విడుద‌ల చేశారు.

Nikhil

నిఖిల్‌ (Nikhil) హీరోగా సంయుక్త‌, న‌భా న‌టేశ్ హీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం 'స్వయంభు' (Swayambhu). భరత్‌ కృష్ణమాచారి (bharat krishnamachari) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను పిక్సెల్.. స్టూడియోస్‌ పతాకంపై భువన్‌, శ్రీకర్ నిర్మించారు. రెండేళ్లుగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ చిత్రం ఇటీవ‌లే షూటింగ్ పూర్తి అయింది. వేస‌విలో పాన్ ఇండియాగా ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ తాజాగా హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వ‌హించి టీజ‌ర్ రిలీజ్ చేశారు. రెండు నిమిషాల 17 సెక‌న్ల పాటు ఉన్న ఈ టీజ‌ర్ అద్యంతం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా ఉంది.

చారిత్ర‌క నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమాలో రాజ్యాలు, అంత‌ర్యుద్ధాలు, అక్క‌డి వారిని కాపాడేందుకు హీరో చేసే సాహసాలతో, అదిరిపోయే విజువ‌ల్స్‌తో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించిన‌ట్లు టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. అంతేగాక క‌మెడియ‌న్ సునీల్‌కు విల‌క్ష‌ణ‌మైన పాత్ర ప‌డిన‌ట్లు తెలుస్తోంది. యువ‌రాణిగా న‌భా, వీర నారిగా సంయుక్త క‌త్తి యుద్ధాలు కూడా వావ్ అనిపించేలా ఉన్నాయి. అన్నింటి క‌న్నా ముఖ్యంగా కాలం క‌త్తై దూస్తే.. కాపాడే క‌వ‌చం కావాలి క‌దా, ఒక వ్య‌క్తే క‌దా అని అనుకుంటే ఇంటిని, ఇల్లే క‌దా అనుకంటే ఆ గ్రామాన్ని, గ్రామ‌మే క‌దా అని వ‌దులుకుంటే ఆ రాజ్యాన్నే వ‌దులుకోవాల్సి వ‌స్తుంది అంటూ వ‌చ్చే డైలాగ్స్ హైలెట్‌గా ఉన్నాయి. మీరూ టీజ‌ర్‌పై ఓ లుక్కేయండి.

Updated Date - Feb 11 , 2026 | 07:51 PM