Irumudi: 'ఇది కార్తీకమాసం స్వామి' వీడియో సాంగ్ వచ్చేసింది
ABN, Publish Date - Sep 06 , 2026 | 01:46 PM
రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ‘ఇరుముడి’ చిత్రం నుంచి మరో వీడియో సాంగ్ వదిలారు.
రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). థియేటర్లను దేవాలయాలుగా మార్చేసిన ఈ సినిమా భారీ విజయం సాధించిన రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
అయ్యప్ప స్వామి దీక్ష విశిష్టతను చెబుతూ ‘కార్తీకమాసం..’ అంటూ సాగే వీడియో సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు శివ నిర్వాణ రాసిన ఈ పాటను సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ ఆలపించారు.