‘ఇంకా ఏం అనుకోలేదు’ నుంచి ఫస్ట్ సాంగ్.. ఆకట్టుకుంటున్న ‘మేఘాలు సంద్రంలో’!

ABN, Publish Date - Nov 10 , 2026 | 04:56 PM

వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఇంకా ఏం అనుకోలేదు’ చిత్రం నుంచి తొలి పాట ‘మేఘాలు సంద్రంలో’ విడుదలైంది. అక్షయ్ లగుసాని, కేయూరి జంటగా నటిస్తున్న ఈ సినిమాకు ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని దర్శకత్వం వహిస్తున్నారు.

వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం 'ఇంకా ఏం అనుకోలేదు'. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో, ఫ్రెండ్‌షిప్ డే వీడియో సోషల్ మీడియాలో మంచి స్పందనను సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాటగా 'మేఘాలు సంద్రంలో' ను గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో విడుదల చేశారు. సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమిల్లి స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్‌ ఆకట్టుకునేలా ఉంది. హీరో అక్షయ్ లగుసాని పోషిస్తున్న అభి పాత్ర ప్రేమ భావాలను నేటి యువత ఆలోచనలకు అనుగుణంగా గీత రచయిత కిట్టు విస్సాప్రగడ తన సాహిత్యంలో వ్యక్తీకరించారు. ఆదిత్య ఆర్కే, గోమతి అయ్యర్ ఆలపించిన ఈ పాటకు వారి గాత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అక్షయ్, కేయూరి మధ్య కెమిస్ట్రీ, అందమైన కాలేజీ నేపథ్యం, ఆకర్షణీయమైన విజువల్స్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. పాట చివర్లో జైకృష్ణ తనదైన వినోదంతో అలరించారు. ఈ చిత్రానికి ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని రచన, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్నేహం, వినోదం ప్రధానాంశాలుగా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 11న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి:

మూడోసారి విడాకులు?.. పవన్ కళ్యాణ్ మరో యుద్ధం చేయాల్సిందే

సూర్య నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు టైటిల్ ఫిక్స్.. మరో హిట్ రాసిపెట్టుకోండమ్మా

విజయ్ సేతుపతి జైత్రయాత్ర.. వరుస రిలీజ్‌లతో ఫుల్ బిజీ

Updated at - Nov 10 , 2026 | 04:58 PM