Haiku: ‘హైకూ’ ట్రైలర్‌ చూస్తే ప్రేమలో పడాల్సిందే!

ABN, Publish Date - Oct 06 , 2026 | 08:02 PM

ఏగన్, శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న రొమాంటిక్, లవ్ ఎంటర్‌టైనర్ ‘హైకూ’ సినిమా ట్రైలర్‌‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఏగన్, శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న రొమాంటిక్, లవ్ ఎంటర్‌టైనర్ ‘హైకూ’ (Haiku) యువరాజ్ చిన్నసామి రచన, దర్శకత్వంలో  విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు  నిర్మిస్తున్నారు. హరి హరన్ రామ్ అదనపు స్క్రీన్‌ప్లే అందించారు. తాజాగా ఈ సినిమా  ట్రైలర్‌‌ను మేకర్స్ విడుదల చేశారు. అమ్మాయిల కాలేజ్‌లో అబ్బాయి జాయిన్ అవ్వడం, కాలేజ్ మొత్తానికి ఒకే అబ్బాయి ఉండటం అనే విచిత్ర పరిస్థితులను చూపిస్తూ ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు.  కాలేజ్ లైఫ్, జాబ్ లైఫ్‌లో ఉన్న లవ్ స్టోరీతో కథలోని సంఘర్షణను అందంగా తెరకెక్కించారు. ట్రైలర్ చివర్లో వచ్చే ‘ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నప్పుడు.. బాగా చూసుకోవాలి.. వన్స్ తను వదిలేసి వెళ్లిపోవాలని డిసైడ్ అయితే కాళ్లు పట్టుకుని బతిమిలాడినా ఉపయోగం ఉండదు’ డైలాగ్‌తో కథ సారాంశాన్ని తెలిపారు. 

ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్‌కి నచ్చే అందమైన ప్రేమ కథా చిత్రంగా ‘హైకూ’ అక్టోబర్ 23న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. షూటింగ్ పూర్తికాకముందే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమాకు ఉన్న ఫ్రెష్ స్టోరీ, ప్రత్యేకమైన ప్రజెంటేషన్ నెట్‌ఫ్లిక్స్‌ను ఆకట్టుకోవడంతో ఫ్యాన్సీ రేటుకు డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ  సినిమాకి ప్రియేష్ గురుస్వామి కెమెరామెన్‌గా, శక్తి ప్రణేష్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. సిద్ధు కుమార్ సంగీత దర్శకుడిగా, ప్రేమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. 


Also Read:

Attahaasam: యో.. పుష్పగాడి అన్న కూతురు హీరోయిన్ అయ్యిందిరో

అరేయ్ ఏం బిగ్ బాస్ రా బాబు.. చిరాకొచ్చేస్తుంది

The Traitors Telugu: బిగ్ బాస్ కన్నా వీళ్లే బావున్నారుగా

Updated at - Oct 06 , 2026 | 09:08 PM