Gandhi Talks: మూకీ చిత్రం ‘గాంధీ టాక్స్’.. ట్రైలర్
ABN, Publish Date - Jan 27 , 2026 | 01:32 PM
విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న మూకీ చిత్రం ‘గాంధీ టాక్స్’ (Gandhi Talks). అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ జాదవ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కిషోర్ పి. బెలేకర్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాపై ఆసక్తిని కలిగించింది. జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ప్రతి కథకు మాటలు అవసరం లేదు.. కొన్ని దృశ్యాలు చూడడంతోనే మనసుకు హత్తుకుంటాయి. ఈ సారి స్క్రీన్‌పై మాటలు ఉండవు.. అది మిమ్మల్ని వినేలా మాత్రమే చేస్తుంది’’ అని విడుదలైన ఈ ట్రైలర్ అలరిస్తుంది.