సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rapid Chitram: ప్రపంచ సినిమా సమాచార మాలిక

ABN, Publish Date - Aug 30 , 2026 | 04:12 PM

వివిధ భాషా చిత్రాలకు సంబంధించిన సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఇంకెందుకు ఆలస్యం చూసేయండిక.

సుమంత్‌ ‘మహేంద్రగిరి వారాహి’లో హీరో సిద్ధు జొన్నలగడ్డ కీలక పాత్రలో నటిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల కానుంది. సాయి కుమార్, సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన పొలిటికల్ డ్రామా ‘ధర్మస్థల నియోజకవర్గం’ నుంచి ట్రైలర్ విడుదలైంది. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తోన్న ‘ఎల్లమ్మ’లో హీరోయిన్‌గా అనంతిక సనిల్‌కుమార్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేవిశ్రీ, అవంతికపై ఫొటోషూట్ కూడా పూర్తయినట్లు టాక్. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. కింగ్ నాగార్జున హీరోగా నటించిన రెండో సినిమా ‘కెప్టెన్ నాగార్జున్’. 1986 ఆగస్ట్ 29వ తేదీన నాగార్జున బర్త్ డే కానుకగా ‘కెప్టెన్ నాగార్జున్’ రిలీజైంది. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మించి, దర్శకత్వం వహించిన ‘కెప్టెన్ నాగార్జున్’లో ఖుష్బూ నాయిక. ఈ సినిమా పరాజయం పాలైంది. ఆ తర్వాత నాగ్ పుట్టినరోజున ఆయన నటించిన మరే సినిమా రిలీజ్ కాలేదు.. ఇంకా ఇలాంటి సినీ అప్డేట్స్ కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

పవర్ స్టార్ బర్త్‌డేకి ‘ఓజీ-2’ అప్డేట్ ఉంటుందా..

‘దాయ్రా’లో డీసీపీ అజూనీ కోహ్లీగా కరీనా.. పవర్‌ఫుల్ పోస్టర్ వైరల్

శంకర్-మురుగదాస్ కాంబోలో మూవీ.. బాక్సాఫీస్ షేకే!

Updated Date - Aug 30 , 2026 | 04:24 PM