ప్రపంచ సినిమా సమాచార మాలిక ‘ర్యాపిడ్‌ చిత్రం’

ABN, Publish Date - Jul 15 , 2026 | 03:12 PM

ప్రపంచ సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే న్యూస్ బులిటెన్ ‘ర్యాపిడ్‌ చిత్రం’. లేటెస్ట్ మూవీ అప్‌డేట్స్ కోసం ఈ క్రింది వీడియో చూసేయండి.

అల్లు అర్జున్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తున్న సినిమా యాక్షన్‌కే పరిమితం చేయకుండా మైథలాజికల్ టచ్ కూడా ఇవ్వబోతున్నారట. త్రివిక్రమ్‌తో మిస్సయిన ‘గాడ్ ఆఫ్ వార్’ లోటును ఈ చిత్రంతో తీర్చుకోబోతున్నారట బన్నీ. సన్నిహితుల సమక్షంలో శ్రుతి హాసన్ గృహప్రవేశం చేశారు. ముంబైలో ఇల్లు ఉన్నప్పటికీ.. చెన్నైలో కొత్త ఇల్లు కొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సీనియర్ హీరోస్ శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ ఈ నెల 17న విడుదల కానుంది. దినేశ్‌ కుమార్, దివిజ ప్రభాకర్ జంటగా నటించిన ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ ఈ నెల 17న విడుదల కానుంది. ‘అదే నీవు అదే నేను’ మూవీ నుంచి ‘మనసా మనసా’ సాంగ్‌ను వి.వి. వినాయక్ రిలీజ్ చేశారు. కనిష్క కంపోజ్ చేసిన ఈ రొమాంటిక్ మెలోడీకి పూర్ణాచారి లిరిక్స్ అందించగా, జావెద్ అలీ పాడారు.. ఇంకా ఇలాంటి మరిన్ని సినీ విశేషాలు తెలుసుకునేందుకు పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

రాష్ట్రాన్ని లీడ్ చేసే అవకాశం వస్తే.. సినీ ఇండస్ట్రీలో అలా చేస్తా: కవిత కల్వకుంట్ల

నెట్‌ఫ్లిక్స్‌లో ‘పెద్ది’.. బుచ్చిబాబు సంచలన పోస్ట్

కేసు పెట్టానని నామీద కక్ష గట్టారు: శ్రష్టి వర్మ

Updated at - Jul 15 , 2026 | 03:41 PM