సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rapid Chitram: సంక్షిప్తంగా సినీ విశేషాలు ర్యాపిడ్ చిత్రం

ABN, Publish Date - Aug 22 , 2026 | 11:46 AM

తెలుగు సినిమా సమాచారంతో పాటు భారతీయ ప్రధాన భాషల సినిమా విశేషాలను అందించే న్యూస్ బులిటెన్ ర్యాపిడ్‌ చిత్రం. హాలీవుడ్‌, ఓటీటీ విశేషాలనూ ఇందులో సంక్షిప్తంగా వీక్షించొచ్చు.

యశ్, గీతూ మోహన్‌దాస్ కాంబోలో రూపుదిద్దుకున్న ‘టాక్సిక్’ చిత్రానికి సెన్సార్ బోర్డు ఎలాంటి కట్స్ లేకుండా ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. భారీ యాక్షన్ రివేంజ్ డ్రామాగా ఆగస్టు 26న ఈ చిత్రం విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రెండు చిత్రాలు శుక్రవారం విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. తెలుగులో ‘ఇరుముడి’.. తమిళంలో ‘మొద రాత్రి’ మూవీస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ‘ఇరుముడి’కి మంచి రెస్పాన్స్ రావడంతో దర్శకుడు శివ నిర్వాణను ‘మైత్రీ’ అధినేతలు అభినందించారు. తిరుపతిలో ఆసియాలోనే అతిపెద్ద 108 అడుగుల సింగిల్ స్క్రీన్ థియేటర్ సిద్ధమవుతోంది. ఎలాంటి సినీ ప్రముఖుల ప్రమేయం లేకుండా కొత్త ఇన్వెస్టర్లు నిర్మిస్తోన్న ఈ భారీ థియేటర్‌ను ‘వారణాసి’ సినిమాతో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తోన్న ‘రోమాంచకం’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 3న విడుదల కానుంది. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ హీరోగా నటించిన ‘డీసీ’ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల వసూళ్ళను దాటింది. అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో లోకేశ్, వామికా గబ్బి నటనతో పాటు అనిరుధ్ మ్యూజిక్ ఆకట్టుకుంది.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

అభినయంలోనూ ఆవిడ షావుకారే..

మామ ‘కాకా’.. అల్లుడు ‘రాకా’.. సరికొత్త సెంటిమెంట్

‘కదిరి నరసింహుడు’ కాదు.. ‘మెగా158’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది.. అరాచకం అంతే!

Updated Date - Aug 22 , 2026 | 11:46 AM