Rapid Chitram: సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం

ABN, Publish Date - Sep 02 , 2026 | 02:55 PM

టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి!

సౌత్ బిగ్‌బాస్ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ భాషల కొత్త సీజన్లు సెప్టెంబర్ 6న రాత్రి 7 గంటలకు ఒకేసారి ప్రారంభం కానున్నాయి. భాష ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ ఒకటే అనే సందేశంతో నలుగురు సూపర్‌స్టార్లు ఉన్న ప్రోమో ఆకట్టుకుంటోంది. రవితేజ, హసిత్ గోలి కాంబినేషన్‌లో రానున్న ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేశ్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో శ్రీవిష్ణుకి జోడీగా మాళవికా మోహనన్ నటిస్తున్నట్లు వినికిడి. రశ్మిక లీడ్ రోల్‌లో నటిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తోన్న ఈ సినిమా నవంబర్ 27న విడుదల కానుంది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత నేషనల్ క్రష్ రశ్మిక.. త్వరలోనే సెట్స్‌లో అడుగుపెట్టనుంది.. ఇంకా ఇలాంటి సినీ విశేషాలను తెలుసుకునేందుకు పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

200 కోట్ల క్లబ్‌లోకి ‘ఇరుముడి’.. మణికంఠుడి పోస్టర్ వైరల్

ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. బండ్లన్న మళ్లీ స్టార్ట్ చేశాడ్రోయ్

పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటేనే పండ‌గ‌.. ఈసారి మునుపటి కంటే మిన్నగా

Updated at - Sep 02 , 2026 | 02:57 PM