200 కోట్ల క్లబ్‌లోకి ‘ఇరుముడి’.. మణికంఠుడి పోస్టర్ వైరల్
ABN , Publish Date - Sep 02 , 2026 | 02:38 PM
మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద తన అసలైన స్టామినాను చూపిస్తూ రికార్డుల వేట కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన నుంచి వచ్చిన ‘ఇరుముడి’ పోస్టర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) బాక్సాఫీస్ వద్ద తన అసలైన స్టామినాను చూపిస్తూ రికార్డుల వేట కొనసాగిస్తున్నారు. ఆయన కథానాయకుడిగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ డ్రామా చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో నిర్మించిన ఈ సినిమా మొదటి రోజు నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌తో థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 200 కోట్ల గ్రాస్ మార్కును విజయవంతంగా దాటేసి ‘జనరేషనల్ బ్లాక్‌బస్టర్’గా నిలిచింది. రవితేజ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచి సరికొత్త మైలురాయిని అందుకుంది.
ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం విడుదల చేసిన సరికొత్త స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణ ఫోటో ఫ్రేమ్ రూపంలో డిజైన్ చేసిన ఈ పోస్టర్‌లో.. మధ్యలో బేబి నక్షత్రను పులిపై కూర్చున్న శ్రీ మణికంఠుడి (బాల అయ్యప్ప) అవతారంలో చూపించారు. ఆమెకు ఇరువైపులా రవితేజ, ప్రియా భవానీ శంకర్ దంపతులుగా చిరునవ్వులు చిందిస్తూ నిలబడి ఉండటం ఆకట్టుకుంటోంది. సినిమాలోని ఫ్యామిలీ బాండింగ్, ఎమోషన్స్‌తో పాటు పోస్టర్‌లో మణికంఠుడి రూపం సరికొత్తగా కుదరడంతో అభిమానులు ఈ పోస్టర్‌ను తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, భావోద్వేగాలతో కూడిన కథనం సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత చేరువ చేశాయి. పోటీగా ఇతర భారీ చిత్రాలు ఉన్నప్పటికీ ఏమాత్రం తగ్గకుండా రవితేజ తన మార్క్ ఎనర్జీతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. 200 కోట్ల మార్కును దాటినప్పటికీ ఇప్పటికీ థియేటర్లలో స్ట్రాంగ్ ఆక్యుపెన్సీతో ‘ఇరుముడి’ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఈ స్పెషల్ పోస్టర్‌తో చిత్ర యూనిట్ సంబరాలు మరింత అంబరాన్నంటాయని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా రవితేజ అభిమానులకు ఈ సినిమా ఫుల్ మీల్స్‌ని పెట్టేసింది.
ఇవి కూడా చదవండి:
ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. బండ్లన్న మళ్లీ స్టార్ట్ చేశాడ్రోయ్
పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటేనే పండగ.. ఈసారి మునుపటి కంటే మిన్నగా
Chiranjeevi: సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు.. తమ్ముడికి చిరు స్పెషల్ బర్త్‌డే విషెస్