Rapid Chitram: సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం

ABN, Publish Date - Aug 26 , 2026 | 02:18 PM

టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి!

యశ్ ‘టాక్సిక్’ సినిమాకు తెలుగు రాష్ట్రాలు టికెట్ ధరల పెంపుకు అనుమతినిచ్చాయి. పది రోజుల పాటు రోజుకు 5 షోలు వేసుకునేలా, సింగిల్ స్క్రీన్లలో రూ. 50, మల్టీప్లెక్స్‌లలో రూ. 100 వరకు అదనంగా ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించాయి. కికు యనమల, కశిష్‌ ఖాన్ నటించిన యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ ‘కికు చిరంజీవి’ ఆగస్ట్ 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించి సినిమాపై బజ్‌ను క్రియేట్ చేశారు. హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్‌లో ఒక కొత్త చిత్రాన్ని ప్రకటించారు. పక్షి కాళ్ళతో కూడిన మిస్టరీ పోస్టర్‌పై ‘ఇప్పటి వరకు చూడని కథ.. ఊహించని జానర్’ అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పిక్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. నివిన్ పాలీ, మమితా బైజుల ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ సెప్టెంబర్ 4న తెలుగులో విడుదల కానుంది. అదే రోజు దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ కూడా రానుండటంతో తెలుగు బాక్సాఫీస్ వద్ద ఈ రెండు అనువాద చిత్రాల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

గొప్ప మనసు చాటుకున్న వినోద్ కుమార్.. ఏం చేశారంటే

‘ఇరుముడి’పై రామ్ చరణ్ ట్వీట్.. వాట్టే టైమింగ్

2.5 కోట్లతో భారతీరాజా స్మారక మండపం.. సీఎం విజయ్‌పై ప్రశంసలు

Updated at - Aug 26 , 2026 | 02:18 PM