Rapid Chitram: సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - Jul 26 , 2026 | 05:34 PM
సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక!
శ్రీనువైట్ల తెరకెక్కించిన ‘దూకుడు’ మహేశ్ బాబు పుట్టిన రోజు కానుకగా ఆగస్ట్ 9న 4K వెర్షన్‌లో రీ-రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. ‘చెన్నై లవ్ స్టోరీ’ సక్సెస్ మీట్ ఎమోషనల్ ఈవెంట్‌గా మారింది. ఈ సినిమా కోసం పడ్డ కష్టాన్నిచిత్రబృందం గుర్తు చేసుకుంటే.. హీరోయిన్ గౌరీ ప్రియ తన తల్లిని తలచుకుని భావోద్వేగానికి గురైంది. నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ కొత్త సినిమాల పోస్టర్లు, గ్లింప్స్ విడుదల చేశారు. అలాగే హీరోలు మంచు మనోజ్, శ్రీవిష్ణు దగ్గరుండి రోహిత్‌తో కేక్ కట్ చేయించి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. సుమంత్ నటించిన ‘న్యూటన్స్ థర్డ్ లా’ నుంచి ట్రైలర్ విడుదలైంది. రాజేశ్ కర్ణ తెరకెక్కిస్తోన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ జూలై 31న విడుదల కానుంది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి వెడ్డింగ్ సాంగ్ వచ్చేసింది. సూర్య పాడిన ఈ పాటకు జి.వి. ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించారు. ఆగస్టు 14న ఈ సినిమా విడుదల కానుంది.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.
ఇవి కూడా చదవండి:
ఆ అమ్మవార్ల ఆశీస్సులతో.. ‘అగధ’ పబ్లిసిటీ జాతర మొదలు
బాలయ్యకు సర్జరీ.. నారా బ్రహ్మణి ఏం చెప్పారంటే
రామా ఏంటిది.. ప్రమోషన్స్ కోసమే రూ. 375 కోట్లా?