Rapid Chitram: సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - Aug 08 , 2026 | 03:10 PM
సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక!
నితేశ్ తివారీ ‘రామాయణ’ విడుదల కంటే ముందే ప్రధాని నరేంద్ర మోదీ కోసం స్పెషల్ షో ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాకు ఆస్కార్ రావాల్సిందేనన్నారు. తమిళనాడు సీఎం విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విడాకుల కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను భార్య సంగీత ఉపసంహరించుకోవడంతో చెంగల్పట్టు కోర్టు ఈ కేసును క్లోజ్ చేసింది. మాస్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా అరుణ్ మాదేశ్వరన్ తీసిన యాక్షన్ డ్రామా ‘డీసీ’ విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో మేకర్స్ సక్సెస్ మీట్ పెట్టి ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. ‘బలగం’ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ నటించిన విలేజ్ ఫ్యామిలీ డ్రామా ‘పళ్ళబురుసు’ ట్రైలర్ విడుదలైంది. ఉదయ్ చౌహాన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.
ఈ వార్తలపై కూడా ఓ లుక్ వేయండి:
హైప్‌ని అందుకోలేకపోతోన్న సుకుమార్ శిష్యులు
‘కొరియన్ కనకరాజు’ నాయికపైనే ఇప్పుడందరి చూపు..!
‘బాహుబలి’ని దాచాడు కానీ.. మహేష్‌ని జక్కన్న దాచలేకపోతున్నాడా