హైప్‌ని అందుకోలేకపోతోన్న సుకుమార్ శిష్యులు
ABN , Publish Date - Aug 07 , 2026 | 06:35 PM
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యులుగా ఇండస్ట్రీకి వచ్చే దర్శకులపై టాలీవుడ్‌లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అది వారి మొదటి సినిమాలతో నిరూపించుకున్నారు కూడా. కానీ, రెండో సినిమా విషయంలోనే తడబడుతున్నారు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) శిష్యులుగా ఇండస్ట్రీకి వచ్చే దర్శకులపై టాలీవుడ్‌లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. సుకుమార్ శిష్యుడిగా అరంగేట్రం చేసిన బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) తొలి చిత్రం ‘ఉప్పెన’తో సంచలన విజయం సాధించి, ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan)తో ‘పెద్ది’ (Peddi) అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించే గోల్డెన్ ఛాన్స్ అందుకున్నారు. ‘పెద్ది’ చిత్రంపై విడుదలకు ముందు మైండ్ బ్లోయింగ్ హైప్ నెలకొన్నప్పటికీ, అది బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి, అంచనాలను అందుకోవడంలో తడబడిందనే చెప్పాలి. వాస్తవానికి ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు, సాధించిన విజయం కేవలం రామ్ చరణ్ పవర్ ఫుల్ ఇమేజ్, ఆయన పడిన కష్టం, తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న క్రేజ్ వల్లే సాధ్యమైందని ప్రతి ఒక్కరూ ఒప్పుకుని తీరాల్సిందే. బుచ్చిబాబు సానా స్క్రీన్‌ప్లే, ప్రెజెంటేషన్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే, తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల్లోనూ భారీ లాభాలతో ఇది మరో రేంజ్ ఘనవిజయం సాధించేదని ట్రేడ్ వర్గాలు సైతం అభిప్రాయం వ్యక్తం చేశాయి.

ఇప్పుడు సరిగ్గా ఇదే తరహా పరీక్షను సుకుమార్ మరో ప్రముఖ శిష్యుడు, ‘దసరా’ (Dasara) ఫేమ్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కూడా ఎదుర్కొంటున్నారు. నేచురల్ స్టార్ నానితో చేసిన ‘దసరా’ బ్లాక్‌బస్టర్ కావడంతో, వీరి కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise) పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. టెక్నికల్ వేల్యూస్, విజువల్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ, టేకింగ్ అందరికీ సులభంగా అర్థమయ్యేలా లేదనే విమర్శలు వచ్చాయి. నాని అభిమానులు సైతం టీజర్ ఉద్దేశాన్ని, ఇంటెన్సిటీని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే రెండు మూడు సార్లు చూడాల్సి వస్తోందని కామెంట్లు చేశారు. ‘పెద్ది’ రిజల్ట్ అందించిన పాఠాలు ఇప్పుడు శ్రీకాంత్ ఓదెలకు ఎంతగానో అవసరమనేలా అప్పుడే ఇండస్ట్రీలో కూడా టాక్ మొదలైంది.
అయితే, ‘పెద్ది’తో పోలిస్తే శ్రీకాంత్ ఓదెలకు సినిమా హైప్‌ను మళ్లీ పీక్స్‌కి తీసుకెళ్లేందుకు ఇంకా మంచి అవకాశం ఉంది. ఎందుకంటే ‘ది ప్యారడైజ్’ మెయిన్ ట్రైలర్ ఇంకా రావలసి ఉంది. టీజర్‌తో వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో ఉంచుకుని.. ట్రైలర్‌ను మాస్, క్లాస్ ప్రేక్షకులకు ఏకకాలంలో కనెక్ట్ అయ్యేలా పవర్‌ఫుల్‌గా కట్ చేస్తే సినిమాపై మళ్లీ భారీ అంచనాలు ఏర్పడతాయి. ‘పెద్ది’ విషయంలో జరిగిన చిన్నపాటి పొరపాట్లను పాఠంగా మలచుకుని శ్రీకాంత్ ఓదెల ట్రైలర్‌తో విరుచుకుపడితే మాత్రం ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయం. చూద్దాం మరి.. ఏం జరుగుతుందో?
ఈ వార్తలపై కూడా ఓ లుక్ వేయండి:
‘కొరియన్ కనకరాజు’ నాయికపైనే ఇప్పుడందరి చూపు..!
‘బాహుబలి’ని దాచాడు కానీ.. మహేష్‌ని జక్కన్న దాచలేకపోతున్నాడా
కొరియన్ కనకరాజు టాక్‌పై మెగాస్టార్ స్పందనిదే..