Rapid Chitram: సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం

ABN, Publish Date - Jul 23 , 2026 | 11:08 AM

టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి!

షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణ హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రభాస్, సందీప్ వంగా కాంబోలో వస్తున్న ‘స్పిరిట్’లో బాలీవుడ్ భామ కత్రినా కైఫ్‌ నటిస్తున్నట్లు తెలుస్తోంది. కథను మలుపు తిప్పే ఒక పవర్‌ఫుల్ రోల్ కోసం కత్రినాతో సంప్రదింపులు జరుపుతున్నారట. ‘లెనిన్’ ఫేమ్ మురళి కిశోర్ సితార బ్యానర్‌లో ధనుష్‌తో రూరల్ డ్రామా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. ధనుష్ ఓకే చెప్పగానే ఈ ప్రాజెక్ట్ పై అధికార ప్రకటన రానుంది. విశాల్ స్వీయ దర్శకత్వంలో నటించిన ‘మకుటం’ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కానుంది. అదే రోజు సూర్య నటిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కూడా రిలీజ్ అవుతుండటంతో బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా మారింది. తనకు ఎలాంటి సర్జరీ జరగలేదని.. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశారు. ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్‌లో అర్జెంటీనా ఓటమి.. మెస్సీ మానసిక స్థితిని ఉద్దేశించి తాను చేసిన బ్లాగ్ పోస్ట్‌ను జనాలు తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన వివరణ ఇచ్చారు... ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

నేను పొందిన పిత్రోత్సాహం.. వారు కూడా పొందాలి కదా: చిరంజీవి

ఏడు నెలల పోరాటం తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా ‘జననాయగన్‌’ ఫీవర్‌

రామ్ చరణ్ నటన అంటే చాలా ఇష్టం: జయకృష్ణ ఘట్టమనేని

Updated at - Jul 23 , 2026 | 11:08 AM