సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rapid Chitram: సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం

ABN, Publish Date - Aug 21 , 2026 | 11:39 AM

టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి!

‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ జోష్‌లో ఉన్న వరుణ్ తేజ్ మరో ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టారు. తన తదుపరి చిత్రాన్ని కార్తిక్ సుబ్బరాజుతో తీస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘బరి’ పూర్తయిన తర్వాతే ఈ కాంబో సెట్స్ పైకి రానున్నట్లు తెలుస్తోంది. సతీశ్‌ జై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘గజ’ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన టీజర్ 5 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో సతీశ్‌కి సాలిడ్ హిట్ పడుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది. సుమన్, సాయికుమార్, నటరాజ్, వితికా షెరు దంపతులు నటిస్తోన్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని సెప్టెంబర్ 4న విడుదల చేస్తున్నారు. అల్లరి నరేశ్ ‘రంభ ఊర్వశి మేనక’ సినిమా నుంచి ‘బ్యాడ్ టైం బ్యాండ్ బాజా’ ఫస్ట్ సింగిల్ విడుదలైంది. చైతన్ భరద్వాజ్ సంగీతంలో భాస్కరభట్ల రాసిన ఈ పాటను రామ్ మిర్యాల పాడారు.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

‘మాన్‌స్టర్’గా సల్మాన్ ఖాన్.. వంశీ పైడిపల్లి స్కెచ్ ఏంటో

‘ఇరుముడి’ దర్శకుడు శివ నిర్వాణతో NSR స్పెషల్ ఇంటర్వ్యూ

సమాజం తిరస్కరించిన వారి జీవితాలపై సినిమా.. టైటిల్ ఇదే

Updated Date - Aug 21 , 2026 | 11:39 AM