సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rapid Chitram: సంక్షిప్తంగా సినీ విశేషాలు ర్యాపిడ్ చిత్రం

ABN, Publish Date - Sep 23 , 2026 | 06:58 PM

తెలుగు సినిమా సమాచారంతో పాటు భారతీయ ప్రధాన భాషల సినిమా విశేషాలను అందించే న్యూస్ బులిటెన్ ర్యాపిడ్‌ చిత్రం. హాలీవుడ్‌, ఓటీటీ విశేషాలనూ ఇందులో సంక్షిప్తంగా వీక్షించొచ్చు.

గుజరాత్‌లో జరిగిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేశారు. ‘కల్కి 2898 AD’ ఉత్తమ పాపులర్ చిత్రంగా, ‘35 - చిన్న కథ కాదు’ ఉత్తమ బాలల చిత్రంగా, ‘కమిటీ కుర్రోళ్లు’ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవగా.. దిగ్గజ నటుడు అనంత్ నాగ్‌‌ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలోని ‘ఆదర్శ కుటుంబం’ సినిమా మ్యూజికల్ జర్నీని మేకర్స్ ప్రారంభించబోతున్నారు. తమన్ సంగీతంలో ‘నారాయణమ్మ’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌‌ను అతి త్వరలోనే మేకర్స్ విడుదల చేయనున్నారు.

నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబోలో రూపుదిద్దుకున్న ‘ద ప్యారడైజ్’ చిత్రానికి సెన్సార్ సభ్యులు భారీ కత్తెర వేశారు. యాక్షన్ సీన్స్, పొలిటికల్ డైలాగ్స్‌పై అభ్యంతరం తెలుపుతూ.. ఏకంగా 21 మార్పులతో పాటు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారు. మరోవైపు అనిరుధ్ పాడిన ‘సమ్మక్క’ పాట ఆకట్టుకుంటోంది. విజయ్ దేవరకొండ, రశ్మికల ‘రణబాలి’ నుంచి ‘ఏందయ్య సామీ’ ఫుల్ సాంగ్ విడుదలైంది. అజయ్-అతుల్ సంగీతంలో రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను అజయ్ గోగావాలే, శ్వేతా మోహన్ అద్భుతంగా పాడారు. రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 16న రిలీజ్ కానుంది. ఇంకా ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

యూఎస్ మార్కెట్‌లో ‘ద ప్యారడైజ్’ రికార్డు.. మహేష్ సరసన నాని!

46 కోట్లు.. రాధ ఫిర్యాదుపై సోదరి అంబిక సవాల్

జానీ మాస్టర్ వైఫ్ సుమలతకు షాక్.. ఆమె కార్యవర్గం రద్దు

Updated Date - Sep 23 , 2026 | 06:58 PM