Rapid Chitram: సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - Sep 12 , 2026 | 10:34 AM
టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి!
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతోన్న ‘ద ప్యారడైజ్’ మూవీ రిలీజ్ డేట్‌పై వస్తున్నపుకార్లకు మేకర్స్ ప్రెస్ మీట్ పెట్టి చెక్ పెట్టారు. ఈ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 24న విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు.. నాని కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్’ చిత్రం పాజిటివ్ టాక్‌తో రన్ అవుతోంది. సినిమాకు వస్తున్న స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. మేకర్స్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సంయుక్త మీనన్ బర్త్‌డే ట్రీట్ అదిరిపోయింది. పుట్టినరోజు సందర్భంగా ‘స్వయంభు’ మేకింగ్ వీడియో, ‘బ్లాక్ గోల్డ్’ పోస్టర్, ‘స్లమ్ డాగ్’ స్టిల్స్‌ను విడుదల చేశారు మేకర్స్. అలాగే రామ్ పోతినేని కొత్త థ్రిల్లర్ చిత్రంలో ఈ బ్యూటీ నటిస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రియదర్శి, నాగ దుర్గ నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఇడుపు కాయితం’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ‘శ్రీలత’ అంటూ సాగే పాటకు సురేశ్ బొబ్బిలి సంగీతం అందించగా... అలరాజు సాహిత్యం అందించారు. ఇంకా ఇలాంటి ఫటా ఫట్ వార్తల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.
ఇవి కూడా చదవండి:
దేవిశ్రీ కాదు.. సుక్కు, చరణ్ ‘RC17’ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?
నా జీవితంలో నటించిన వారికి ఆస్కార్ ఇవ్వొచ్చు: ఆర్తి
రామ్ పోతినేని బిగ్ సర్‌ప్రైజ్.. హీరోయిన్‌గా క్రేజీ బ్యూటీ
Updated at - Sep 12 , 2026 | 10:34 AM