దేవిశ్రీ కాదు.. సుక్కు, చరణ్ ‘RC17’ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?

ABN , Publish Date - Sep 12 , 2026 | 09:11 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కబోతోన్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘RC17’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో వార్త వైరల్ అవుతోంది.

RC17 Music Director

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), జీనియస్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కలయికలో తెరకెక్కబోతోన్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘RC17’. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన కల్ట్ క్లాసిక్ ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి చరిత్ర సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్ర ఘనవిజయంలో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంతటి కీలక పాత్ర పోషించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుకుమార్-డీఎస్పీలది టాలీవుడ్‌లో తిరుగులేని సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కావడంతో.. చరణ్‌తో చేయబోయే ‘RC17’ చిత్రానికి కూడా దేవిశ్రీనే సంగీతం అందిస్తారని అందరూ భావించారు. అయితే, అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి దేవిశ్రీ తప్పుకున్నారంటూ ఫిలింనగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం జోరుగా చక్కర్లు కొడుతోంది.


ఈ మార్పు వెనుక బలమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’ (Yellamma) అనే చిత్రం ద్వారా వెండితెరకు హీరోగా పరిచయం కాబోతున్నారు. పూర్తిస్థాయి కథానాయకుడిగా తన డెబ్యూ మూవీ షూటింగ్‌లు, ప్రిపరేషన్స్‌లో ఆయన బిజీగా ఉండటంతో.. సుకుమార్ ప్రాజెక్ట్‌కు అవసరమైన పూర్తి సమయాన్ని కేటాయించడం కష్టంగా మారిందట. దీంతో పరస్పర అవగాహనతోనే ఈ సినిమాకు దేవిశ్రీ కాకుండా వేరే సంగీత దర్శకుడిని ఎంచుకోవాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు సమాచారం.


ఈ క్రమంలో సుకుమార్ తన కెరీర్‌లోనే మునుపెన్నడూ పనిచేయని ఒక సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌ను రంగంలోకి దించుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ మరెవరో కాదు.. సౌత్ ఇండియాను తన బీట్స్‌తో షేక్ చేస్తున్న రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander). ఇప్పటికే ఎన్టీఆర్ ‘దేవర’తో పాటు పలు భారీ చిత్రాలకు అదిరిపోయే మ్యూజిక్ అందిస్తూ తన సత్తా చాటుతున్న అనిరుధ్.. సుకుమార్‌తో జట్టుకట్టడం ఇదే తొలిసారి కానుంది. రామ్ చరణ్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, సుకుమార్ రా అండ్ రస్టిక్ టేకింగ్‌కు అనిరుధ్ హై-వోల్టేజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, త్వరలోనే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. దసరాకు ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

నా జీవితంలో నటించిన వారికి ఆస్కార్‌ ఇవ్వొచ్చు: ఆర్తి

రామ్ పోతినేని బిగ్ సర్‌ప్రైజ్.. హీరోయిన్‌గా క్రేజీ బ్యూటీ

చిరు ‘కాకా’పై థమన్ మాస్ ప్రామిస్.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!

Updated Date - Sep 12 , 2026 | 09:11 AM