Rapid Chitram: సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - Sep 30 , 2026 | 02:16 PM
టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి!
‘ద ప్యారడైజ్’ చిత్ర బృందం ములుగులోని ప్రసిద్ధ సమ్మక్క సారలమ్మ దేవాలయానికి వెళ్ళారు. అలానే శ్రీ గట్టమ్మ దేవాలయాన్ని కూడా సందర్శించారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హీరో నానితో పాటు సంపూర్ణేశ్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా ఇందులో పాల్గొన్నారు. రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తోన్న ‘ఏమో ఏమో ఇది’ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది. హిమాలయాల్లో రొమాంటిక్‌గా చిత్రీకరించిన ఈ పాటను కృష్ణకాంత్ రాయగా, హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతంలో కార్తీక్, రమ్య బెహరా పాడారు. ఈ సినిమా అక్టోబర్ 30న విడుదల కాబోతోంది.
స్టార్ కమెడియన్స్ సత్య, యోగి బాబు కాంబోలో వస్తున్న క్రైమ్ కామెడీ మల్టీస్టారర్ ‘గోల్డెన్ భాగ్యం’. ‘రంగబలి’ దర్శకుడు పవన్ బాసంశెట్టి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘గోల్డెన్ భాగ్యం’ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారి తెరకెక్కిస్తోన్న ‘రామాయణ’ మూవీ అఫీషియల్ బిహైండ్ ది సీన్స్ వీడియోను రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. సినిమా కోసం టీమ్ పడ్డ కష్టాన్ని చూపుతున్న ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.
ఇవి కూడా చదవండి:
Raashii Khanna: షారుఖ్ ఖాన్‌లా.. ఒక వారమైనా బతకాలనుంది
బాలయ్య అభిమానులకు గూస్‌బంప్స్ న్యూస్.. ఇక ఆపడం కష్టమే!
ఉదారత చాటుకున్న.. ‘కాంచన’ నటుడు! గబ్బర్ సింగ్ రమేష్‌కి శ్రీమన్ సాయం