Raashii Khanna: షారుఖ్ ఖాన్‌లా.. ఒక వారమైనా బతకాలనుంది

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:41 PM

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ పై హీరోయిన్ రాశీ ఖన్నా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

Raashii Khanna, Shah Rukh Khan

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) పై హీరోయిన్ రాశీ ఖన్నా (Raashii Khanna) ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తన యాక్టింగ్ కెరీర్ లో కనీసం ఒక వారం రోజులైనా 'కింగ్ ఖాన్' షారుఖ్ ఖాన్ లా బతకాలని ఉందని ఆమె తెలిపారు.

'వేర్వేరు జనరేషన్ల ప్రజలు కూడా షారుఖ్ ను ఎంతో అభిమానిస్తారు. కళ్లతోనే వంద మాటలు పలికించే గొప్ప నటుడు ఆయన. స్క్రీన్ పై ఎఫర్ట్ లెస్ గా రొమాన్స్ చేయడంలో షారుఖ్ దిట్ట. ఇక ఆయన హ్యూమర్ సెన్స్ కూడా ఎంతో బాగుంటుంది. అందుకే షారుఖ్ తో నా కెరీర్ ను స్వాప్ చేసుకోవాలని ఉంది' అని రాశీ చెప్పుకొచ్చారు.

Updated Date - Sep 30 , 2026 | 01:04 PM