Rapid Chitram: సంక్షిప్తంగా సినీ విశేషాలు ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - Aug 27 , 2026 | 05:15 PM
తెలుగు సినిమా సమాచారంతో పాటు భారతీయ ప్రధాన భాషల సినిమా విశేషాలను అందించే న్యూస్ బులిటెన్ ర్యాపిడ్ చిత్రం. హాలీవుడ్, ఓటీటీ విశేషాలనూ ఇందులో సంక్షిప్తంగా వీక్షించొచ్చు.
అక్కినేని నాగార్జున ‘కింగ్ 100’ నుంచి బర్త్ డే ట్రీట్ రెడీ అవుతోంది. రా. కార్తిక్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ నుంచి ఆగస్ట్ 29న టైటిల్, ఫస్ట్ గ్లింప్స్‌ను ట్రీట్‌గా వదలనున్నారు. ఈ సినిమాలో టబు కీలక పాత్ర పోషిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ‘ఇరుముడి’ ప్రభంజనం సృష్టిస్తోంది. రవితేజ, బేబి నక్షత్ర పోటీపడి మరీ అందించిన నటనకు ప్రేక్షకులే కాదు.. సినీ దిగ్గజాలు సైతం ఫిదా అవుతున్నారు. ధనుష్, రామ్ చరణ్, వరుణ్ తేజ్‌తో పాటు విరోషి జంట కూడా ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ‘మేమ్ ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన ‘రోమాంచకం’ నుంచి ట్రైలర్ విడుదలైంది. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 3న విడుదల కానుంది. కోలీవుడ్ నటుడు సూరి హీరోగా, సుహాస్ ప్రతి నాయకుడిగా నటిస్తోన్న ‘మండాడి’ టీజర్ విడుదలైంది. మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో వస్తున్న ఈ సముద్ర యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 10న విడుదల కానుంది.. ఇంకా ఇలాంటి సినీ అప్డేట్స్ కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.
ఇవి కూడా చదవండి:
డైరెక్టర్ పవన్ సాధినేని కేసులో ట్విస్ట్.. పలువురు మహిళలతో!
మనం బతకాలి.. ఇతరులనూ బతికించాలి.. ‘ఇరుముడి’పై చిరు పోస్ట్ వైరల్
GV Narayanarao: నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత..
Updated at - Aug 27 , 2026 | 05:15 PM