Rapid Chitram: సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్‌ చిత్రం

ABN, Publish Date - Sep 17 , 2026 | 05:16 PM

సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్‌ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక!

‘ఆదిపురుష్’ ఫ్లాప్ వల్ల ఓమ్ రౌత్-రామ్ చరణ్‌తో సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. సుకుమార్ ప్రాజెక్ట్‌ తర్వాత ఓమ్‌తో మూవీ ఉంటుందని.. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. రియల్ స్టార్ శ్రీహరి కుమారుడు మేఘాంశ్ నటిస్తున్న మిస్టీరియస్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఆస్మాన్’ టీజర్‌ను మంచు మనోజ్ విడుదల చేశారు. రామ్ నందన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని మేఘాంశ్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మంచు మనోజ్, శివాత్మిక రాజశేఖర్, నిర్మాత వెంకటేశ్ పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

హీరో సూర్య -జ్యోతిక జంట తమ 20 ఏళ్ళ బంధానికి గుర్తుగా లండన్ చర్చిలో మరోసారి పిల్లల సమక్షంలో పెళ్ళి ప్రమాణాలు చేసుకుని ఉంగరాలు మార్చుకున్నారు. తెల్లటి గౌనులో జ్యోతికను చూసి సూర్య ఎమోషనల్ అయ్యారు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ పెళ్ళితంతు వైరల్‌గా మారింది. సందీప్ కిషన్, జాసన్ సంజయ్ కాంబోలో వస్తోన్న ‘సిగ్మా’ను మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో విడుదల చేస్తున్నారు. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ఈ యాక్షన్ డ్రామా విడుదలవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్‌మీట్ నిర్వహించి మూవీ విశేషాలను పంచుకున్నారు.. ఇంకా ఇలాంటి సీన విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

పల్లవి జోషికి సి.బి.ఎఫ్.సి.లో చోటు... విమర్శకులపై విరుచుకుపడ్డ వివేక్ అగ్నిహోత్రి

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ రిలీజ్‌పై అనుమానాలు.. అసలు విషయం ఏంటంటే

సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రారంభం

Updated at - Sep 17 , 2026 | 05:16 PM