Rapid Chitram: సంక్షిప్తంగా సినీ విశేషాలు ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - Sep 13 , 2026 | 07:08 PM
తెలుగు సినిమా సమాచారంతో పాటు భారతీయ ప్రధాన భాషల సినిమా విశేషాలను అందించే న్యూస్ బులిటెన్ ర్యాపిడ్ చిత్రం. హాలీవుడ్, ఓటీటీ విశేషాలనూ ఇందులో సంక్షిప్తంగా వీక్షించొచ్చు.
విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపుదిద్దుకుంటోన్న ‘ఆదర్శ కుటుంబం’ నుంచి టీజర్ విడుదలైంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కానుంది. కోలీవుడ్ నటుడు సూరి, టాలీవుడ్ యాక్టర్ సుహాస్ నటించిన ‘మండాడి’ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో మేకర్స్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న చిత్రబృందం ప్రేక్షకుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. సూరితో త్వరలో మరో సినిమా చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘హ్యాపీ జర్నీ’ ట్రైలర్ విడుదలైంది. అభిరామ్ నాయుడు తెరకెక్కించిన ఈ మూవీ సెప్టెంబర్ 18న విడుదల కానుంది. మూడేళ్ళ విరామం తర్వాత రేణూ దేశాయ్ ప్రధాన పాత్రలో నటించిన ‘కాశీ మజిలీ’ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. యమున కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబరు 13న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.. ఇంకా ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.
ఇవి కూడా చదవండి:
హ్యాట్రిక్ కాంబో రిపీట్.. మరో భారీ మాస్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్!
‘మండాడి’ బ్లాక్ బస్టర్ హిట్టని ముందే చెప్పారు: సూరి
‘పిఠాపురంలో.. అలా మొదలైంది’.. క్లైమాక్స్ సీన్‌కు కంటతడి పెట్టాల్సిందే!
Updated at - Sep 13 , 2026 | 07:08 PM