సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rapid Chitram: సంక్షిప్తంగా సినీ విశేషాలు ర్యాపిడ్ చిత్రం

ABN, Publish Date - Jul 30 , 2026 | 03:56 PM

తెలుగు సినిమా సమాచారంతో పాటు భారతీయ ప్రధాన భాషల సినిమా విశేషాలను అందించే న్యూస్ బులిటెన్ ర్యాపిడ్‌ చిత్రం. హాలీవుడ్‌, ఓటీటీ విశేషాలనూ ఇందులో సంక్షిప్తంగా వీక్షించొచ్చు.

అల్లు అర్జున్, అట్లీ కాంబో ‘రాకా’ మూవీ చివరి షెడ్యూల్ ఆగస్టులో మొదలు కానుంది. భారీ సెట్‌లో బన్నీ వైల్డ్ ఎంట్రీ యాక్షన్ సీన్‌ను చిత్రీకరిస్తారు. ఇదిలా ఉంటే.. ఓ ఈవెంట్‌లో నిర్మాత బన్నీ వాస్‌ తనపై ఉన్న అభిమానంతోనే ఆ పేరు పెట్టుకున్నారని.. ఇప్పుడు మార్చుకుంటే ‘ఆసు’ అని పెట్టుకోమని సలహా ఇచ్చేవాడినని అల్లు అర్జున్ చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న ‘ఆదర్శ కుటుంబం’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో వెంకటేశ్ కూతురు ‘సంపూర్ణ’గా యువినా పార్థవి కనిపించనుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 2న విడుదల కానుంది. నటుడు మాధవన్ రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తమిళనాడు పళనిలో వ్యర్థ భూమిని కొనుగోలు చేసి.. సేంద్రీయ పద్ధతులతో పచ్చని కొబ్బరి తోటగా పండించారు. పైగా తక్కువ ధరకే స్థానిక రైతులకు కొబ్బరి నారు అందిస్తూ వారికి అండగా నిలిచారు. శర్వానంద్, సంపత్ నంది కాంబోలో వస్తున్న ‘భోగి’ చిత్రం క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో 800 మంది జూనియర్ ఆర్టిస్టులతో 22 రోజుల పాటు ఈ యాక్షన్ సీన్‌ను చిత్రీకరించారు.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

రమేష్‌కు పవన్ కళ్యాణ్ రూ. 5 లక్షల సాయం.. ‘గబ్బర్‌సింగ్’ టీమ్ స్పందనిదే

సూర్య, రాజమౌళి క్రేజీ కాంబో టాక్.. సోషల్ మీడియా షేక్!

‘మా’ ఆధ్వర్యంలో ముగిసిన పావలా శ్యామల అంత్యక్రియలు

Updated Date - Jul 30 , 2026 | 03:56 PM