Rapid Chitram: సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్‌ చిత్రం

ABN, Publish Date - Jun 26 , 2026 | 04:31 PM

సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్‌ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక!

మహేశ్ బాబు ‘వారణాసి’లో ఒక్క షాట్ కోసం రాజమౌళి ఏకంగా 94 టేకులు తీసుకున్న విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. రామ్ పోతినేని సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘రాపో-23’ని వంద కోట్లతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్‌ రంగంలోకి దిగుతున్నారట. ప్రియదర్శి, జానపద గాయని నాగదుర్గ జంటగా వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఇడుపు కాయితం’ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పర్సెంటేజ్‌పై ఛాంబర్‌కు సబ్ కమిటీలోని నిర్మాతలు, పంపిణీదారులు లేఖను అందజేశారు. దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ జంటగా.. సతీష్ ఆవాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘వెంకట్రామయ్యగారి తాలుకా’. ఈ మూవీ టీజర్‌ను నిర్మాత సురేశ్ బాబు విడుదల చేశారు.. ఇంకా ఇలాంటి మరెన్నో సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

ఖుష్బూ సుందర్ కుమార్తె పెళ్లిలో చిరు, నాగ్, వెంకీ సందడి!

ఇది ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజాలు జన్మించిన నేల- బాలయ్య

నిన్న రిజిస్టర్ మ్యారేజ్.. నేడు సంప్రదాయం ప్రకారం ఫైమా పెళ్లి

Updated at - Jun 26 , 2026 | 04:31 PM