Rapid Chitram: సంక్షిప్తంగా సినీ విశేషాలు ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - Jul 25 , 2026 | 10:50 AM
తెలుగు సినిమా సమాచారంతో పాటు భారతీయ ప్రధాన భాషల సినిమా విశేషాలను అందించే న్యూస్ బులిటెన్ ర్యాపిడ్ చిత్రం. హాలీవుడ్, ఓటీటీ విశేషాలనూ ఇందులో సంక్షిప్తంగా వీక్షించొచ్చు.
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో సినిమాకు లభిస్తున్న ఆదరణతో మేకర్స్ శ్రీరాములు థియేటర్‌లో సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. సూర్య నటిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ స్ట్రెయిట్ తెలుగు సినిమా కాదన్నారు డైరెక్టర్ వెంకీ అట్లూరి. ముందు తమిళంలో తీసిన తర్వాత తెలుగులోకి డబ్ చేసినట్లు తాజాగా నిర్వహించిన ప్రమోషన్స్‌లో ఆయన స్పష్టం చేశారు. స్వర్గీయ యన్టీఆర్ సతీమణి శ్రీమతి బసవరామతారకం శత జయంతి సందర్భంగా నందమూరి బసవరామతారకం యన్టీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు కుటుంబ సభ్యులు. జయకృష్ణ ఘట్టమనేని, రాషా తడాని జంటగా అజయ్ భూపతి తెరకెక్కించిన ‘శ్రీనివాస మంగాపురం’ సెన్సార్ పూర్తి చేసుకుంది. ‘యూబైఏ’ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా జూలై 30న విడుదలయ్యేందుకు అన్ని రకాలుగా సిద్ధమైంది.. ఇంకా మరిన్ని సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.
ఇవి కూడా చదవండి:
సోషల్ మీడియాకు ఈ హీరోయిన్లు బైబై
ఈ వయసులో శ్రీరాముడి పాత్రలో జీవించడం చాలా కష్టం: రణ్‌బీర్ కపూర్
అల్లుడు భద్రంకు ‘మెగా158’లో అవకాశం.. సోము వీర్రాజు ఏం చేశారంటే