సోషల్ మీడియాకు ఈ హీరోయిన్లు బైబై
ABN , Publish Date - Jul 25 , 2026 | 10:36 AM
సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత జీవితాలపై, వృత్తిపరమైన విషయాలపై వచ్చే రూమర్లను భరించలేక పలువురు హీరోయిన్లు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. అందుకే సోషల్ మీడియా విషయంలో ఇప్పుడో నిర్ణయానికి వచ్చారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా (Social Media) సినీ తారలకు, అభిమానులకు మధ్య ఒక ముఖ్యమైన వారధిగా మారింది. అయితే, ఇదే వేదికపై కొంతకాలంగా సాగుతున్న అసత్య ప్రచారాలు, అనవసరపు వివాదాలు సినీ సెలబ్రిటీలకు పెద్ద తలనొప్పిగా పరిణమించాయి. తమ వ్యక్తిగత జీవితాలపై, వృత్తిపరమైన విషయాలపై వచ్చే రూమర్లను భరించలేక పలువురు హీరోయిన్లు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఇచ్చే పబ్లిసిటీ కంటే తమ మానసిక ప్రశాంతతే ముఖ్యమని భావిస్తూ, వరుసగా పలువురు భామలు సోషల్ మీడియా ఖాతాలకు శాశ్వతంగా ‘బైబై’ చెప్పేస్తున్నారు.
ఈ జాబితాలో ప్రముఖ కథానాయిక ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) సంచలన నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇకపై వంద కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా సరే, మళ్లీ సోషల్ మీడియా ఖాతాను ఓపెన్ చేసే ప్రసక్తే లేదని ఆమె అత్యంత ఖచ్చితంగా స్పష్టం చేయడం గమనార్హం. అదేవిధంగా, ప్రస్తుతం దక్షిణాది చిత్రసీమలో కథానాయికగా మంచి క్రేజ్ సంపాదించుకుని బిజీగా ఉన్న యువ నటి మమిత బైజు (Mamitha Baiju) కూడా డిజిటల్ దునియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు తన సినిమాల అప్‌డేట్స్‌ను నేరుగా సోషల్ మీడియాలోనే పంచుకున్న ఆమె, ఇకపై తన ప్రాజెక్టులు మరియు వ్యక్తిగత వివరాలను కేవలం తన పీఆర్ టీమ్ మాత్రమే వెల్లడిస్తుందని స్పష్టం చేశారు.
మరోవైపు ‘ద ప్యారడైజ్’ సహా పలు ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించి మెప్పించిన గ్లామరస్ నటి కయాదు లొహర్ (Kayadu Lohar) కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు. సోషల్ మీడియాలో ఉండే నిరంతర హడావుడి కంటే తన వ్యక్తిగత జీవితానికి, మనశ్శాంతికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు. నెగిటివిటీకి దూరంగా ఉంటూ, పీస్‌ఫుల్ లైఫ్‌ను గడపడానికే తాను సోషల్ మీడియా అకౌంట్లను వీడుతున్నట్లు ఆమె ప్రకటించారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు క్రేజీ హీరోయిన్లు సోషల్ మీడియాకు దూరమవ్వడం ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, నెటిజన్లలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి:
ఈ వయసులో శ్రీరాముడి పాత్రలో జీవించడం చాలా కష్టం: రణ్‌బీర్ కపూర్
అల్లుడు భద్రంకు ‘మెగా158’లో అవకాశం.. సోము వీర్రాజు ఏం చేశారంటే
‘కపాలి’గా రోహిత్ నారా.. ఫస్ట్ లుక్ అదిరింది