Rapid Chitram: ‘దాదా’లో బాలయ్య రీఎంట్రీ, ‘కాకా’ షూటింగ్ అప్‌డేట్.. ఇంకా మరిన్ని విశేషాలు
ABN, Publish Date - Oct 09 , 2026 | 12:17 PM
తెలుగు సినిమా సమాచారంతో పాటు భారతీయ ప్రధాన భాషల సినిమా విశేషాలను అందించే న్యూస్ బులిటెన్ ర్యాపిడ్ చిత్రం. హాలీవుడ్, ఓటీటీ విశేషాలనూ ఇందులో సంక్షిప్తంగా వీక్షించొచ్చు.
‘దాదా’ సెట్‌లో బాలకృష్ణ జాయిన్ అయ్యారు. గాయం కారణంగా రెస్ట్ మోడ్‌లో ఉన్న నందమూరి హీరో.. తాజాగా మైసూర్‌లో జరుగుతోన్న షెడ్యూల్‌లో పాల్గొన్న వీడియోను మేకర్స్ షేర్ చేశారు. యాక్షన్ మోడ్‌లోకి వచ్చిన బాలయ్యపై కీలక యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తున్నారట. చిరంజీవి-బాబీ కాంబోలో వస్తున్న ‘కాకా’ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తవ్వగా, మిగిలిన కీలక షెడ్యూల్‌ను ఈ అక్టోబర్ నెలాఖరుకల్లా పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
విజయ్ దేవరకొండ, రశ్మిక నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామాగా ‘రణబాలి' ట్రైలర్ విడుదలైంది. రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 16న విడుదల కానుంది. ఇప్పటికే బయటకు వచ్చిన సాంగ్స్, డాక్యుమెంటరీ సిరీస్ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ‘కామ్రేడ్ కళ్యాణ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీవిష్ణు, కోన వెంకట్ సినిమా విశేషాలను పంచుకున్నారు. శ్రీవిష్ణు నటన, పాజిటివ్ మైండ్‌సెట్ వల్లే ఈ సినిమా కుటుంబ సమేతంగా నచ్చేలా వచ్చిందన్న కోన వెంకట్ ‘అదుర్స్ 2’ గురించి త్వరలోనే ఎన్టీఆర్‌ను కలుస్తానని చెప్పారు.. ఇలాంటి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.
ఇవి కూడా చదవండి:
సుమలత పిటిషన్‌తో డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్..
Scene Movie: సూర్య, నజ్రియా.. ‘అమ్మో ఇది ఎవర్రా’
కోలీవుడ్‌కు మరో టాలీవుడ్ హీరోయిన్ జంప్