Rapid Chitram: సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - Aug 28 , 2026 | 04:32 PM
సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘ఫోర్బ్స్ ఇండియా షో స్టాపర్స్ 2026’ ఎడిషన్ కవర్ పేజీపై మెరిశారు. బన్నీతో పాటు రామ్ చరణ్ కూడా ఈ టాప్-100 జాబితాలో స్థానం సంపాదించుకోవడంతో ఇరు హీరోల ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. నాని ‘ద ప్యారడైజ్’ ప్రమోషన్స్‌కు గ్లోబల్ టచ్ ఇస్తున్నారు. ఈ సినిమా సెకండ్ సింగిల్‌ను అమెరికాలోని డల్లాస్‌లో జరిగే లైవ్ కాన్సర్ట్‌లో ఆగస్ట్ 28న నాని సమక్షంలో లైవ్‌లో విడుదల చేయనున్నారు అనిరుధ్. అల్లరి నరేశ్, చంద్రమోహన్ చింతాడ కాంబోలో వస్తోన్న ‘రంభ ఊర్వశి మేనక’ సినిమా టైటిల్ సాంగ్‌ను ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతానికి సురేశ్ బనిశెట్టి సాహిత్యం అందించగా.. ధనంజయ్ సీపాన, సాహితీ చాగంటి పాటను ఆలపించారు. నివిన్ పాలీ, మమితా బైజు జంటగా నటించిన ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. గిరీశ్ ఎ.డి. దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో కూడా విడుదల కానుంది. ‘ప్రేమలు’ విజయం తర్వాత మమితా ఖాతాలో మరో 100 కోట్ల సినిమా పడిందని సినీ వర్గాలు అంటున్నాయి.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.
ఇవి కూడా చదవండి:
Rag Mayur: సెప్టెంబర్ 18న 'అనుమాన పక్షి'
మరోసారి దిల్ రాజు Vs మైత్రీ! ఈసారి ఏమయ్యేనో
Updated at - Aug 28 , 2026 | 04:32 PM