Panchnama : ఆసక్తికరంగా పంచనామా ట్రైలర్
ABN, Publish Date - Sep 07 , 2026 | 03:03 PM
భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన 'పంచనామా'ను సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు
తెలుగు ప్రేక్షకులను అలరించేలా ఆసక్తికరమైన కథాంశాలతో ముందుకు సాగుతున్న జీ5 మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ 'పంచనామా'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉండనున్నాయి. ఉత్కంఠభరితమైన దర్యాప్తుతో పాటు భావోద్వేగాలు, మిస్టరీ, క్రైమ్ అంశాలను ఈ సిరీస్‌లో ఆసక్తికరంగా మేళవించారు. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ రిలీజైంది.