‘జాంబీ రెడ్డి 2’లో రియల్ స్టార్ ఉపేంద్ర.. ఫస్ట్ లుక్ చూస్తే వణకాల్సిందే

ABN , Publish Date - Sep 18 , 2026 | 05:33 PM

‘హను-మాన్’, ‘మిరాయ్’ వంటి వరుస పాన్-ఇండియా విజయాలతో బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసిన యంగ్ సూపర్ హీరో తేజ సజ్జా హీరోగా రాబోతున్న సరికొత్త విజువల్ వండర్ ‘జాంబీ రెడ్డి 2 NXT LVL’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

Zombie Reddy 2 NXT LVL Poster

‘హను-మాన్’, ‘మిరాయ్’ వంటి వరుస పాన్-ఇండియా విజయాలతో బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసిన యంగ్ సూపర్ హీరో తేజ సజ్జా హీరోగా రాబోతున్న సరికొత్త విజువల్ వండర్ ‘జాంబీ రెడ్డి 2 NXT LVL’ (Zombie Reddy2 NXT LVL). టాలీవుడ్‌లో జాంబీ జానర్‌ను పరిచయం చేసి బ్లాక్‌బస్టర్ కొట్టిన ‘జాంబీ రెడ్డి’కి ఇది సీక్వెల్. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఒరిజినల్ క్రియేటర్ ప్రశాంత్ వర్మ మెంటార్‌గా వ్యవహరిస్తుండగా.. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘రానా నాయుడు’, ‘హక్’ వంటి సూపర్ హిట్ సిరీస్‌ల దర్శకుడు, ప్రముఖ రచయిత సుపర్ణ్ ఎస్. వర్మ (Suparn S Varma) దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే తేజ సజ్జా (Teja Sajja) పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు ఆడియన్స్ నుంచి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ షనాయా కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర (Real Star Upendra) అత్యంత కీలక పాత్రలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 18న ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయనకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ విడుదల చేసిన స్పెషల్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.


ఈ పోస్టర్‌లో ఉపేంద్రను ఇప్పటివరకు ఎవరూ ఊహించని సరికొత్త వైల్డ్, ఫియర్స్ అవతార్‌లో ప్రెజెంట్ చేశారు. దట్టమైన అడవిలో భారీ వృక్షం కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ.. చేతిలో భీకరమైన పొడవైన ఆయుధాన్ని పట్టుకుని.. కోపంగా చూస్తున్న ఉపేంద్ర లుక్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. రఫ్ అండ్ రా గెటప్, విరబోసిన జుట్టు, ట్రైబల్ డిజైన్లతో కూడిన డార్క్ కాస్ట్యూమ్స్ ఈ క్యారెక్టర్‌ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో స్పష్టం చేస్తున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో వెలుగుతున్న కాగడాలు, మిస్టీరియస్ వాతావరణం పోస్టర్‌కు సరికొత్త ఫాంటసీ-యాక్షన్ డెప్త్‌ను తీసుకొచ్చాయి.


పోస్టర్‌పై డిజైన్ చేసిన “READY TO TURN THE WORLD UPSIDE DOWN” (ప్రపంచాన్ని తలకిందులు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు) అనే ట్యాగ్‌లైన్ ఉపేంద్ర గెటప్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అయింది. విలక్షణ నటనతో ఎప్పుడూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ఉపేంద్ర.. ఈ చిత్రంలో తన కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని పాత్రలో విశ్వరూపం చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలతో పాటు విదేశీ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని నేపాలీ, జపనీస్ భాషల్లోనూ గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఈ పాట కోరిన వారు... మూవీ రివ్యూ

పవన్ కళ్యాణ్‌‌తో ఒకే ఒక్క ఛాన్స్.. : నటి కావ్యశ్రీ

క్రికెట్‌లో లెజెండే.. పడకగదిలో ఆకట్టుకోలేదు: రోహిత్ శర్మపై నటి షాకింగ్ కామెంట్స్

Updated Date - Sep 18 , 2026 | 05:33 PM