Peddi: చూసింది శాంపిల్ మాత్ర‌మే.. అస‌లు సినిమా క‌థ వేరే! ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే

ABN , Publish Date - May 29 , 2026 | 12:15 PM

పెద్ది కేవలం రొటీన్ స్పోర్ట్స్ డ్రామానా..? లేక దీని వెనుక దర్శకుడు బుచ్చిబాబు దాచిన అసలు సిసలైన మైండ్ గేమ్ ఇంకోటి ఉందా..?

peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్ లో వస్తున్న పెద్ది (Peddi) సినిమా కోసం గ్లోబల్ వైడ్‌గా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు రిలీజైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ అన్నీ కూడా సినిమాపై హైప్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. అయితే, ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ మాత్రం ప్రేక్షకులలో కొద్దిగా మిశ్రమ స్పందనను రాబట్టింది. కొందరికి యాక్షన్ సీన్స్ నచ్చితే, మరికొందరేమో ఇందులో కొత్తదనం లేదంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. మరి నిజంగానే పెద్ది కేవలం రొటీన్ స్పోర్ట్స్ డ్రామానా..? లేక దీని వెనుక దర్శకుడు బుచ్చిబాబు దాచిన అసలు సిసలైన మైండ్ గేమ్ ఇంకోటి ఉందా..?

సాధారణంగా ట్రైలర్ అనగానే సినిమా కథేంటో ఒక ఐడియా వచ్చేలా కట్ చేస్తారు. కానీ, పెద్ది విషయంలో మేకర్స్ చాలా తెలివిగా ప్లాన్ మార్చినట్లు తెలుస్తోంది. ఫస్ట్ ట్రైలర్‌లో కేవలం స్పోర్ట్స్‌కు సంబంధించిన ఎలివేషన్ సీన్స్, రామ్ చరణ్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్, కుస్తీ, క్రికెట్‌, రన్నింగ్‌ వంటి ఆటల చుట్టూ ఉండే యాక్షన్‌ను మాత్రమే హైలైట్ చేశారు. అసలు సినిమా కథను ఎక్కడా రివీల్ చేయలేదు. ఒకవేళ ఇప్పుడే మెయిన్ పాయింట్‌ను బయటపెడితే, థియేటర్లలో ప్రేక్షకులకు దక్కే అసలైన కిక్ మిస్ అవుతుందనే ఉద్దేశంతోనే ట్రైలర్‌ను ఆ విధంగా కట్ చేశారట. అయితే పెద్ది కేవలం ఒక ఆటగాడి కథో, లేక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివెంజ్ డ్రామానో అస్సలు కాదట. ఈ సినిమాకు ఊపిరి పోసే మెయిన్ పాయింట్ వేరే ఉందట.

తమ ఊరి ప్రజల శ్రేయస్సు కోసం, అక్కడికి రావాల్సిన ఒక రైల్వే ట్రాక్ కోసం పెద్ది అనే క్యారెక్టర్ పడ్డ కష్టమే ఈ సినిమా అంతర్లీన కథాంశం. ఈ రైల్వే ట్రాక్ సమస్య చుట్టూనే సినిమాలోని భావోద్వేగాలు, రాజకీయాలు, యాక్షన్ సీక్వెన్సులు ముడిపడి ఉంటాయని సమాచారం. ఈ సినిమాకు అత్యంత కీలకమైన, ఆయువుపట్టు లాంటి ఒక భారీ ఎపిసోడ్ ఉందట. అదే ఢిల్లీ ఎపిసోడ్. దాదాపు 40 నిమిషాల పాటు సాగే ఈ ఢిల్లీ బ్యాక్‌డ్రాప్ సీన్స్ టోటల్ సినిమాను ఒక ఊపు ఊపేస్తాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. చరణ్ క్యారెక్టరైజేషన్, బుచ్చిబాబు రాసుకున్న డైలాగ్స్, ఎమోషన్స్ ఈ 40 నిమిషాల్లో పీక్స్‌లో ఉంటాయట. కేవలం యాక్షన్, ఊరి సమస్యలే కాకుండా.. పెద్దిలో డివోషనల్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయని టాక్. ఇదివరకే రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పెద్ది పహిల్వాన్ గ్లింప్స్ చూస్తే ఈ విషయం మనకు ఇట్టే అర్థమవుతుంది. ఆ గ్లింప్స్‌లో హనుమాన్ రిఫరెన్స్‌తో కొన్ని షాట్స్ డిజైన్ చేశారు.

ఇక ఫస్ట్ ట్రైలర్ వల్ల వచ్చిన ఆ కాస్త మిక్స్‌డ్ టాక్‌ను, నెగిటివిటీని పూర్తిగా తుడిచేసేందుకు చిత్ర యూనిట్ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. సినిమాలో దాగి ఉన్న ఎమోషన్స్, డివోషనల్ యాంగిల్స్, రైల్వే ట్రాక్ పాయింట్లను కొద్దిగా హింట్ ఇస్తూ.. మరో అదిరిపోయే సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. జూన్ 2న హైదరాబాద్‌లో జరగబోయే గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కన్నా ముందే ఈ ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు వేగవంతం చేశారు. మొదటి ట్రైలర్ చూసి ఒక అంచనాకు వచ్చేసిన ఆడియన్స్‌కు, ఈ రెండో ట్రైలర్ ఖచ్చితంగా ఒక పెద్ద షాక్ ఇవ్వబోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ కొత్త ప్లానింగ్ పెద్ది సినిమాపై ఉన్న నెగిటివిటీని పటాపంచలు చేసి, రామ్ చరణ్ ఖాతాలో మరో గ్లోబల్ బ్లాక్‌బస్టర్‌ను వేస్తుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి:

ఆడియో జ్యూక్ బాక్స్ విడుదల.. ‘పెద్ది’ టీమ్ తప్పు చేసిందా?

యూపీ‌లో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?

‘అమ్మ’కు ఏమైంది? మరో సీనియర్ నటి సంచలన ఆరోపణలు!

Updated Date - May 29 , 2026 | 02:15 PM