Vrushakarma: ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్..
ABN, Publish Date - Oct 15 , 2026 | 04:40 PM
నాగ చైతన్య, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘వృషకర్మ’ Vrushakarma). 'కౌంట్‌డౌన్ ప్రారంభమైందంటూ' ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది నిర్మాణ సంస్థ
నాగ చైతన్య, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘వృషకర్మ’ Vrushakarma). 'కౌంట్‌డౌన్ ప్రారంభమైందంటూ' ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ను నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ‘వృషకర్మ’ విడుదల తేదీని ప్రకటించింది. డిసెంబర్ 4న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందని కొత్త పోస్టర్ తో వెల్లడించారు.
‘ఈ ఏడాదిలోనే అత్యుత్తమ థియేట్రికల్ అనుభూతిని అందించేందుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో 50 రోజుల్లో ‘వృషకర్మ’ బిగ్ స్క్రీన్స్‌పై ప్రేక్షకులను అబ్బురపరచనుంది’ అంటూ చిత్ర బృందం పేర్కొంది.
అంతేకాదు, ఇంతకు ముందెన్నడూ చూడని ఓ అద్భుతమైన పౌరాణిక దృశ్యకావ్యంగా ఈ సినిమా ఉండబోతోందనే సంకేతాలను ఇచ్చింది. కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకుడు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాత. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, గ్లింప్స్ సోషల్ మీడియా విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే
ALSO READ:
పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాల్లో ఏం జరిగింది? డాక్టర్ సంచలన వ్యాఖ్యలు
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు పోలీసుల నోటీసులు.. అక్టోబర్ 28 డెడ్‌లైన్!
‘జైలర్ 2’ ప్రీ-సేల్స్ విధ్వంసం: టాప్ 10 ఆల్‌టైమ్ లిస్ట్‌లో రజనీ రికార్డ్
జైలర్ 2 రివ్యూ.. సీక్వెల్ సెంటిమెంట్‌ను చెరిపేసిన రజనీకాంత్!