Naga Chaitanya : కసరత్తులు షురూ

ABN , First Publish Date - 2023-08-05T00:04:57+05:30 IST

ఓ కొత్త సినిమా చేసే ముందు, ఆ పాత్ర కోసం తమని తాము సన్నద్ధం చేసుకోవడానికి ఈతరం హీరోలు చాలా కష్టపడుతున్నారు. కథని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడానికి తమ వంతు హోమ్‌ వర్క్‌ చేస్తున్నారు. ఆ జాబితాలో నాగచైతన్య ముందు వరుసలోనే ఉంటాడు. చైతూ కథానాయకుడిగా

Naga Chaitanya : కసరత్తులు షురూ

ఓ కొత్త సినిమా చేసే ముందు, ఆ పాత్ర కోసం తమని తాము సన్నద్ధం చేసుకోవడానికి ఈతరం హీరోలు చాలా కష్టపడుతున్నారు. కథని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడానికి తమ వంతు హోమ్‌ వర్క్‌ చేస్తున్నారు. ఆ జాబితాలో నాగచైతన్య ముందు వరుసలోనే ఉంటాడు. చైతూ కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. బన్నీ వాస్‌ నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. మత్స్యకారుల జీవన నేపథ్యంలో సాగే కథ ఇది. నాగచైతన్య ఓ జాలరిగా కనిపించనున్నారు. 2018లో జరిగిన ఓ యదార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఓవైపు స్ర్కిప్టు సిద్ధం అవుతోంది. మరోవైపు జరిగిన ఘటన గురించి మరింత సమాచారం సేకరించడానికి నాగచైతన్య, చందూ మొండేటి రంగంలోకి దిగారు. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లోని మత్స్యకారుల్ని కలుసుకొని, వాళ్ల జీవన విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. శుక్రవారం నాగచైతన్య, చందూ మొండేటి, బన్నీ వాస్‌.. విశాఖ పోర్టుని సందర్శించారు. మత్స్యకారులతో కలిసి బోటులో సముద్రంలోకి వెళ్లారు. నాగచైతన్య ఈ చిత్రంలో ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడబోతున్నాడు. అందుకు సంబంధించి ప్రత్యేక శిక్షణ కూడా తీసుకొంటున్నాడు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తారు.

Updated Date - 2023-08-05T00:04:57+05:30 IST