ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ‘లెగసీ’!

ABN , Publish Date - Sep 05 , 2026 | 07:28 PM

విశ్వక్‌ సేస్‌ తాజా చిత్రం 'లెగసీ' విడుదల తేదీ ఖరారైంది. డిసెంబర్ 4న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

Vishwak Sen Legacy Movie

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘లెగసీ’ విడుదల తేదీ ఖరారైంది. ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. యశ్వంత్ దగ్గుమాటితో కలిసి దర్శకుడు, రచయిత సాయి కిరణ్ రెడ్డి దైదా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంజయ్ సాంబ్రాణి, వి.వి.ఎన్. ప్రసాద్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చిత్ర విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ఓ స్ట్రైకింగ్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. విశ్వక్ సేన్, ఏక్తా రాథోడ్ కనిపిస్తున్న ఈ కొత్త పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.


‘పిండం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సాయికిరణ్ రెడ్డి దైదా, ‘లెగసీ’తో తన రెండో ఫీచర్ ఫిల్మ్‌ను తెరకెక్కిస్తున్నారు. అలాగే ‘పిండం’ తర్వాత కలాహి మీడియా నిర్మిస్తున్న రెండో చిత్రం కూడా ఇదే కావడం విశేషం. పవర్‌ఫుల్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ‘లెగసీ’లో అధికారం, కుటుంబం, ప్రేమ, ద్రోహం వంటి అంశాల మధ్య జరిగే ఆసక్తికర సంఘర్షణను ఆవిష్కరించనున్నారు. తన తండ్రి వదిలిన వారసత్వం కారణంగా ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఓ యువకుడి ప్రయాణంలో విశ్వక్ సేన్ పాత్ర సాగుతుంది.

123.jpg


ఈ చిత్రంలో ప్రముఖ హిందీ నటుడు కే కే మీనన్ అత్యంత శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. రావు రమేష్, సచిన్ ఖేడేకర్, మురళీ మోహన్, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల, అనీష్ కురువిళ్ల, ఖుషీ రవి, కల్యాణి నటరాజన్, రవి కాలే, అమిత్ తివారీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్ర సాంకేతిక విభాగంలో సినిమాటోగ్రాఫర్‌గా జిజు సన్నీ, సంగీత దర్శకుడిగా గోవింద్ వసంత, ఎడిటర్‌గా శిరీష్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్‌గా రాజీవ్ నాయర్, యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా జాషువా పని చేస్తున్నారు.

ALSO READ:

Vishwambhara: OTT డీల్‌ కోసమే ఎదురుచూపులు.. డీల్‌ లాక్ అయితే రిలీజ్ డేట్‌ ఫిక్స్!

ఇత‌నే నా ల‌వ‌ర్‌.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన ప్ర‌ముఖ తెలుగు యూట్యూబ‌ర్‌

Biggboss 10: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10.. హౌస్‌లోకి వెళ్లేది వీళ్లేనా?

Updated Date - Sep 05 , 2026 | 07:30 PM