సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రణబాలి డాక్యుమెంటరీ.. తెలుగులో ఉంటే ఇంకా బావుండేది

ABN, Publish Date - Sep 28 , 2026 | 07:08 PM

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం రణబాలి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 16 న రిలీజ్ కి సిద్ధమవుతోంది.

Ranabaali

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం రణబాలి (Ranabaali). మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 16 న రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా అంచనాలను పెంచేశాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా రణబాలికి చిత్రబృందం ఎంత కష్టపడింది., ఆ కథ ఏంటి.. ? అనేది చూపించే మేకింగ్ వీడియోలను నాలుగు పార్ట్స్ గా ఒక డాక్యుమెంటరీగా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.


తాజాగా మొదటి పార్ట్.. ట్రూత్ 1 - ది ఫెమిన్ వి ఫర్ గాట్ పేరుతో రిలీజ్ చేశారు. 1876-1878 కాలంలో భారతదేశాన్ని కుదిపేసిన గ్రేట్ మద్రాస్ ఫెమిన్ (కరువు) నేపథ్యాన్ని ఈ వీడియో ద్వారా పరిచయం చేశారు. బ్రిటిష్ పరిపాలన కాలంలో దాదాపు కోటి మంది భారతీయులు కరువుతో ఆకలికి బలవుతుంటే, ఇక్కడి ధాన్యాన్ని బ్రిటన్‌కు తరలించిన చారిత్రాత్మక నిజాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెలిపాడు. ఈ చిత్రం కోసం బళ్లారి, ప్రాచీన గ్రంథాలయాలు, పురావస్తు శాఖ ఆఫీసుల్లో విస్తృతమైన పరిశోధనలు చేసి కథను సిద్ధం చేసినట్లు వెల్లడించాడు


నటి రష్మిక మందన్న మాట్లాడుతూ.. 'చరిత్రలో జరిగిన ఈ దారుణమైన నిజాల గురించి విన్నప్పుడు నా గుండె తలక్రిందులైంది. మన పూర్వీకులు అనుభవించిన ఆవేదనను, చేసిన త్యాగాలను ప్రతిబింబించే చిత్రంలో భాగం కావడం ఎంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది. విజయ్ దేవరకొండ సైతం ఈ కథ అందరికీ తెలియాలని, ఇలాంటి పాత్ర చేయడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఈ బిహైండ్ ది సీన్స్ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ది హిస్టరీ వి ఫర్ గాట్ పేరుతో నెక్స్ట్ పార్ట్ ట్రూత్-2 ను సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే... వీడియోలో అందరూ ఇంగ్లీష్ లో చెప్పడం వలన.. చాలామందికి వారు చెప్పిన భావం అర్ధం కాలేదు. అచ్చ తెలుగు కథ గురించి తెలుగులో చెప్పి ఉంటే ఇంకా బావుండేది అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో విజయ్- రష్మిక ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Updated Date - Sep 28 , 2026 | 07:10 PM