Ranabaali: విజయ్ దేవరకొండ ‘రణబాలి’ వచ్చేది అప్పుడే
ABN, Publish Date - Aug 27 , 2026 | 08:42 AM
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’ విడుదల ఖరారైంది
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’ (Ranabaali). రష్మిక కథానాయిక. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తొలుత సెప్టెంబరు 11న విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. పలు కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. గురువారం చిత్ర బృందం కొత్త విడుదల తేదీని ప్రకటించింది.
దసరా పండుగ సందర్భంగా అక్టోబరు 16న ‘రణబాలి’ని విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో చోటుచేసుకున్న కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా ఇది. ఇందులో విజయ్ దేవరకొండ ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నారు.