సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రేయ్.. నీ అక్క.. విజయ్ ని అంత మాట అంటావా రష్మిక

ABN, Publish Date - Oct 03 , 2026 | 03:48 PM

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'రణబాలి

Ranabaali

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika) జంటగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'రణబాలి' (Ranabaali). సీమ హిడెన్ హిస్టరీ కథాంశంతోరూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 16 న రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి ఆదరణ లభించింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో స్పీడు పెంచిన మేకర్స్ తాజాగా ప్రముఖ యాంకర్ సుమతో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. సెలబ్రిటీలను తన ఇంటికి పిలిచి ఇంటర్వ్యూలు చేసే సుమను రణబాలి టీమ్ తమ ఇంటికి పిలిచి ఆతిధ్యం అందించారు. ఇందుకు సంబంధించిన ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు.


సీమ నేపథ్యపు సంప్రదాయ సెటప్‌లో విజయ్, రష్మిక, రాహుల్, సుమ కూర్చుని చేసిన ఈ సంభాషణ అత్యంత సరదాగా, నవ్వులు పూయించేలా సాగింది. ఈ ఇంటర్వ్యూలో దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ మాట్లాడుతూ.. రష్మిక చేసిన జయమ్మ పాత్ర లుక్, ఆమె ప్రవర్తన చూసి సెట్స్‌లో తాను నిజంగానే భయపడిపోయానని సరదాగా చెప్పుకొచ్చాడు. ఇక విజయ్ దేవరకొండ.. జయమ్మ పాత్రను గురించి చెప్పుకొచ్చాడు. 'జయమ్మ రోల్ చేసి చేసి,పెళ్లయిన తర్వాత రషీ ఏదో చెబుతుంది..రెండు సార్లు నేను పలకలేదంటే రేయ్...నీ అక్క అని పిలుస్తుంది' అని చెప్పుకొచ్చాడు. దీంతో సుమ షాక్ అయ్యింది. అంతే కాకుండా ఇంట్లో రష్మిక వంట చేయడానికి ప్రయత్నిస్తే పెద్ద యుద్ధం జరిగినట్లే ఉంటుందని కూడా చెప్పుకొచ్చాడు.


ఇక ఈ సరదా ప్రోమో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. చివర్లో సుమ.. విజయ్- రష్మిక కొట్టుకోవడం చూసి 'ఇప్పుడు మీరిద్దరూ భార్యాభర్తల్లా ప్రవర్తిస్తున్నారు.. నాకు ఇది చాలా నచ్చింది' అంటూ చేసిన హిలేరియస్ కామెంట్స్ ఇంటర్వ్యూలో నవ్వుల పువ్వులు పూయించాయి. ఈ ప్రోమో చూసిన రష్మిక- విజయ్ ఫ్యాన్స్.. అమ్మ రష్మిక.. విజయ్ ని అంత మాట అంటావా.. భర్తను అలా అనడం తప్పు కదా అని కొందరు.. తెలంగాణ కోడలు అంటే ఆ మాత్రం పౌరుషం ఉండాలిలే అని ఇంకొందరు అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. విజయ్- రష్మిక పెళ్లి తరువాత వస్తోన్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో ఈ జంట ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Updated Date - Oct 03 , 2026 | 03:48 PM