Vijay Devarakonda: ఈ ఏడాదిలోనే రణబాలి బెస్ట్ ఫిల్మ్
ABN, Publish Date - Oct 16 , 2026 | 09:01 PM
ఎన్నో అంచనాల నడుమ ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి రణబాలి. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ - రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది.
ఎన్నో అంచనాల నడుమ ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి రణబాలి(Ranabaali). టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) - రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా (Rashmika) హీరోయిన్ గా నటించింది. పెళ్లి తరువాత ఈ జంట నటించిన సినిమా కవడంతో మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే అంచనాలను పెట్టుకొని థియేటర్ కి వెళ్ళిన ప్రేక్షకులు నిరాశతో బయటికి వచ్చారు. మొదటి షో నుంచి మిక్స్డ్ టాక్ అందుకుంటున్న రణబాలి చిత్రబృందం తాజాగా ప్రత్యేక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. 'మన మీడియా మిత్రులు రణబాలి సినిమా చూసి ఫోన్స్ చేసి మాట్లాడిన మాటలు, పంపిన మెసేజ్లు చూసి వారిని కలవాలని ఈ ఈవెంట్ ఏర్పాటు చేశాం. మేము నిన్న సాయంత్రమే సినిమా చూశాం. ఇది ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన బెస్ట్ ఫిల్మ్ అని చెప్పగలను. మా కెరీర్ లో గర్వపడే సినిమా అవుతుంది. ఇది నా 14వ సినిమా. నేను ఒక ముప్పై సినిమాలు చేసిన తర్వాత కూడా ఒక సినిమా గురించి, అందులోని పర్ఫార్మెన్స్ గురించి, ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుంటారు. అలాంటి చిత్రమే రణబాలి. ఈ సినిమా పెద్ద విజయం సాధించబోతోంది. ఎందుకంటే మీడియా మిత్రులే ఈ సినిమాను తమ భుజాలపై పెట్టుకుని ముందుకు తీసుకెళ్తున్నారు' అంటూ మీడియాకు కృతజ్ఞతలు తెలిపాడు.
సినిమా మేకింగ్ గురించి విజయ్ మాట్లాడతూ.. "ఈ సినిమా చేస్తున్నప్పుడే పెద్ద హిట్ కొట్టాలి, పెద్ద నెంబర్స్ క్రియేట్ చేయాలని అటెంప్ట్ చేయలేదు. ఈ సినిమా మన వాళ్లకు చూపించడం చాలా ముఖ్యమని భావించి చేశాం. టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత కూడా అందరికీ మా మూవీ చూస్తున్నప్పుడు ఎన్నో లేయర్స్ కనిపిస్తాయి. దర్శకుడు రాహుల్ ఈ చిత్రాన్ని ఒక అద్భుతమైన ప్యాకేజ్లా చేశాడు. నా ఫిల్మోగ్రఫీ, తెలుగు సినిమా ఫిల్మోగ్రఫీలో రణబాలి ఒక ముఖ్యమైన చిత్రంగా మిగిలిపోతుంది' అని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. అలాగే రేపటి నుంచి విజయవాడ, అనంతపురం, శింగనమల, గుంటూరు, వైజాగ్ ప్రాంతాల్లో పర్యటించి ఆడియెన్స్ను నేరుగా కలవబోతున్నట్లు తెలిపాడు. ఇక భవిష్యత్తు ప్రాజెక్ట్ల గురించి మాట్లాడుతూ.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక క్యూట్ రోమ్కామ్ మూవీ చేస్తున్నానని, ప్రతి సినిమాను ఇష్టపడి చేస్తున్నానని విజయ్ చెప్పుకొచ్చాడు.