సందీప్ పిలిస్తే రాకపోతే బతికి దండగ..: విజయ్ దేవరకొండ

ABN , Publish Date - Aug 30 , 2026 | 11:35 PM

బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) సమర్పణలో, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాణంలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘రోమాంచకం’. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ స్పీచ్ వైరల్ అవుతోంది.

Vijay Deverakonda Speech at Romanchakam Event

బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) సమర్పణలో, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాణంలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘రోమాంచకం’ (Romanchakam). సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 2న ప్రీమియర్స్‌తో మొదలయ్యే ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ ద్వారా సునీల్ నారంగ్ విడుదల చేస్తున్నారు. ఆదివారం ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ముఖ్య అతిథిగా హాజరై సందీప్ రెడ్డి వంగా, సుమంత్ ప్రభాస్‌లపై ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

మా బాండింగ్ అంతకుమించి..

ఈ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘సందీప్ పై నాకున్న ప్రేమని మాటల్లో చెప్పలేను. ఇది దర్శకుడు-హీరో, బ్రదర్స్ లేదా ఫ్రెండ్స్ మధ్య ఉండే బంధం మాత్రమే కాదు.. అంతకుమించింది. ‘అర్జున్ రెడ్డి’ టైమ్‌లో మేమిద్దరం కలిసి ఒక యుద్ధమే చేశాం. ఆ సినిమా వర్కవుట్ కాకపోతే ఏమయ్యేదో ఊహించలేకపోయాం, ఇద్దరికీ మెంటల్ వచ్చేసేది. అప్పుడు చేతిలో డబ్బు లేదు, ఇన్ఫ్లుయెన్స్ లేదు, పెళ్లిచూపులు కూడా రిలీజ్ కాలేదు కాబట్టి ఫ్యాన్స్ బలం కూడా వెనక లేదు. జస్ట్ ధైర్యంగా అడుగేశాం. ‘అర్జున్ రెడ్డి’ సక్సెస్ మాత్రమే కాదు.. సందీప్‌తో షేర్ చేసుకున్న క్షణాలు, లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌లు చాలా గొప్పవి. పైసలు లేనప్పుడు సందీప్ అన్న ప్రణయ్, వాళ్ల నాన్నతో పొలం అమ్మించి.. నా మీద, సందీప్ మీద నమ్మకంతో అర్జున్ రెడ్డి తీశారు. వాళ్ల కుటుంబ సంపాదన మొత్తం ఆ సినిమాపైనే పెట్టారు. అంతటి రిస్క్ చేసిన సందీప్ కోసం నేను ఎక్కడిదాకా అయినా వెళ్తా.. నాకోసం సందీప్ ఎక్కడికైనా వస్తాడు. సందీప్ పిలిచాక ఈ ఈవెంట్‌కు రాకపోతే నేను బతికి వేస్ట్’’ అని ఎమోషనల్ అయ్యారు.


ఆ సౌండ్ గుర్తొస్తుంది

విజయ్ ఇంకా మాట్లాడుతూ.. ‘‘భద్రకాళీ పిక్చర్స్ లోగో స్క్రీన్‌ పై పడుతుంటే ఇప్పటికీ ‘అర్జున్ రెడ్డి’ బ్యాక్‌గ్రౌండ్ సౌండ్‌ట్రాక్ గుర్తొస్తూనే ఉంటుంది. అది నా సొంత బ్యానర్ లాంటిది. సందీప్, ప్రణయ్ అన్న కలిసి సినిమా తీస్తున్నారంటే అది ఎట్టిపరిస్థితుల్లోనూ హిట్ కొట్టాల్సిందే. ఈ సినిమాతో పాటు డైరెక్టర్ వేణు, మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి, సుమంత్, అనంతిక అందరికీ పెద్ద సక్సెస్ దక్కాలి. వాసుకి కంపోజ్ చేసిన ‘రాధారమణ’ పాట మా తమ్ముడు ఆనంద్‌కు చాలా ఇష్టం, ఇంట్లో రోజూ లూప్‌లో వింటుంటాడు.

సుమంత్ ప్రభాస్ కళ్లలో ఆ ఫైర్ చూశా..

నా రౌడీ వేర్ ఆఫీస్ ఉన్నప్పుడు సుమంత్‌ని చూస్తుండేవాడిని. అప్పుడే అతని కళ్లలో సినిమా పట్ల ఒక డ్రీమ్, బ్రైట్‌నెస్, తపన కనిపించింది. వీడు ఏదో ఒకరోజు కచ్చితంగా నటుడు లేదా దర్శకుడు అవుతాడని, అప్పుడు మనం తోడుండాలని అనుకున్నా. ‘మేము ఫేమస్’ సినిమాకు కూడా నా వంతు ప్రమోషన్ చేశా. సుమంత్.. నీతో ఎవరూ లేకపోయినా నేను ఎప్పుడూ తోడుంటా. ఫలితం గురించి ఆలోచించకుండా సినిమా తీసే ప్రాసెస్‌ని ఎంజాయ్ చేయండి. కళ్లలో ఆశయం, గుండెల్లో ఫైర్, మనపై మనకు నమ్మకం ఉంటే ఈరోజు కాకపోయినా రేపైనా ఎవరూ ఊహించని సక్సెస్ వచ్చి తీరుతుంది’’ అని చెప్పారు.


రష్మిక రెస్ట్ తీసుకుంటోంది

ప్రస్తుతం డైరెక్టర్ శౌర్యువ్‌తో చేయబోయే సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానని, విపరీతమైన ఎగ్జైట్‌మెంట్‌తో ఉన్నానని తెలిపారు. వేదికపై ఉన్న యాంకర్ ‘రణబాలి’ మూవీ, రష్మిక మందన్న ప్రస్తావన తీసుకురాగా.. ‘‘తనకు చిన్న ఇంజురీ అయింది, ప్రస్తుతం రికవర్ అవుతోంది, ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తోంది.. తర్వాత ‘రణబాలి’ వస్తుంది, అప్పుడు మాట్లాడదాం’’ అని విజయ్ సరదాగా సమాధానమిచ్చారు. ‘రోమాంచకం మూమెంట్’ గురించి యాంకర్ అడగ్గా.. ‘‘1989లో నేను పుట్టినప్పటి నుంచి నా లైఫ్ రోమాంచకమే. చేతిలో పైసలు ఉన్నా లేకపోయినా, ప్రేమలో పడినా, హార్ట్‌బ్రేక్ అయినా.. ప్రతి క్షణం ఒక రోమాంచకమే’’ అంటూ విజయ్ ఇచ్చిన స్పీచ్‌కి ఆడిటోరియం క్లాప్స్‌తో హోరెత్తింది.

ఇవి కూడా చదవండి:

ఆ క్లాసిక్ సాంగ్‌ను రీమిక్స్ చేస్తున్న త్రివిక్ర‌మ్‌.. ఇక దండాలే

తప్పు చేస్తే గల్లా పట్టి బయటకు గెంటండి: డ్యాన్స్ మాస్టర్ రఘు

జానీ, సుమలత మాస్టర్స్‌కు షాక్.. డ్యాన్సర్స్ యూనియన్ సంచలన నిర్ణయం

Updated Date - Aug 30 , 2026 | 11:35 PM