సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రవితేజ కొత్త మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్! మ‌ళ్లీ హిట్ గ్యారంటీపో

ABN, Publish Date - Oct 01 , 2026 | 04:43 PM

మాస్ మహారాజా రవితేజ.. ఈ పేరు వింటేనే థియేటర్లలో విజిళ్లు, ఈలలు సంబరాలు గుర్తుకొస్తాయి.

Ravi Teja, Vivek Athreya

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja).. ఈ పేరు వింటేనే థియేటర్లలో విజిళ్లు, ఈలలు సంబరాలు గుర్తుకొస్తాయి. ఇటీవల వచ్చిన ‘ఇరుముడి’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర రవితేజ చూపించిన రచ్చ అంతా ఇంతా కాదు. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, రవితేజ కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్టింగ్ మూవీగా నిలిచింది.​గతంలో వచ్చిన కొన్ని ప్లాప్స్‌తో కాస్త ఇబ్బంది పడిన మాస్ రాజా, 'ఇరుమూడి' గ్రాండ్ సక్సెస్‌తో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశారు. ఈ రేంజ్ విజయం రావడంతో ఆయన తదుపరి ప్రాజెక్ట్‌లపై అభిమానుల్లోనూ, ఇండస్ట్రీ వర్గాల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ప్రస్తుతం రవితేజ లైనప్‌లో వరుసగా యువ దర్శకుల సినిమాలు ఉన్నాయి. అందులో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న మోస్ట్ క్రేజీ కాంబినేషన్.. దర్శకుడు వివేక్ ఆత్రేయ (Vivek Athreya) తో చేయబోయే ప్రాజెక్ట్.​'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా', 'అంటే సుందరానికి', 'సరిపోదా శనివారం' సినిమాలతో తనకంటూ ఒక సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు వివేక్ ఆత్రేయ. విభిన్నమైన టేకింగ్‌‌తో ప్రశంసలు అందుకునే వివేక్ ఆత్రేయ, ఈసారి మాస్ రాజా కోసం ఓ సరికొత్త కథను సిద్ధం చేశారు.​విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఒక ఊహించని 'హారర్ కామెడీ థ్రిల్లర్' జానర్‌లో రాబోతోందట. రవితేజ మార్క్ కల్ట్ కామెడీ టైమింగ్, ఆయన మాస్ ఎనర్జీకి.. వివేక్ ఆత్రేయ మార్క్ స్క్రీన్ ప్లే తోడైతే బాక్సాఫీస్ వద్ద పూనకాలే అని చెప్పొచ్చు.

ఇక ఈ సినిమాకి సంబంధించి ఫిల్మ్ నగర్‌లో ఓ ఆసక్తికరమైన వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఈ హారర్ ఎంటర్‌టైనర్‌కి మేకర్స్ తులా భారం (Thulabharam) అనే క్యాచీ టైటిల్‌ను ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.​ఈ టైటిల్ వినడానికి చాలా డిఫరెంట్‌గా, ఆసక్తికరంగా ఉంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.​ఇప్పటికే దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌ను కూడా పూర్తిగా పూర్తి చేసినట్టు తెలుస్తోంది.

కథ, కథనంపై ఫుల్ క్లారిటీతో ఉన్న దర్శకుడు.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. రాబోయే దసరా పండుగ శుభ ముహూర్తాన ఈ సినిమా షూటింగ్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారని ఇండస్ట్రీ టాక్.​రవితేజ లాంటి మాస్ హీరో ఒక పక్కా హారర్ కామెడీ థ్రిల్లర్ చేస్తే ఎలా ఉంటుంది? వివేక్ ఆత్రేయ ఆయనను ఏ రేంజ్‌లో ప్రజెంట్ చేయబోతున్నారు? అనే ప్రశ్నలే ఇప్పుడు ఫ్యాన్స్‌లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతున్నాయి. రూ. 250 కోట్ల 'ఇరుమూడి' విజయం తర్వాత రాబోతున్న ఈ 'తులా భారం' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

Updated Date - Oct 01 , 2026 | 04:43 PM